హైదరాబాద్‌లో కరోనా డేంజర్ బెల్స్.. కొత్త కంటైన్మెంట్ జోన్ల ఏర్పాటు..!

కోవిద్-19 విజృంభిస్తోంది. దీని కట్టడికోసం లాక్ డౌన్ లో ఉండటం.. శానిటైజర్లు, మాస్కులు వాడటం.. తప్పనిసరి. లాక్ డౌన్ నిబంధనల సడలింపుతో ప్రజా జీవనం మొదలైంది. అయితే రోజురోజుకు గ్రేటర్

హైదరాబాద్‌లో కరోనా డేంజర్ బెల్స్.. కొత్త కంటైన్మెంట్ జోన్ల ఏర్పాటు..!
Follow us

| Edited By:

Updated on: May 24, 2020 | 6:24 PM

Coronavirus In Greater Hyderabad: కోవిద్-19 విజృంభిస్తోంది. దీని కట్టడికోసం లాక్ డౌన్ లో ఉండటం.. శానిటైజర్లు, మాస్కులు వాడటం.. తప్పనిసరి. లాక్ డౌన్ నిబంధనల సడలింపుతో ప్రజా జీవనం మొదలైంది. అయితే రోజురోజుకు గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో హైదరాబాద్ లో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా విడుదల చేసిన రిపోర్ట్ ల ప్రకారం 12 రోజుల్లోనే హైదరాబాద్ పరిధిలో 500 కేసులు నమోదయ్యాయి. దీంతో సంబంధిత అధికారులు కొత్త కంటైన్మెంట్ జోన్ల ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు.

సికింద్రాబాద్ ఏరియా లో కేసులు ఎక్కువగా నమోదౌతున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. కోవిద్-19 పాజిటివ్ గా వచ్చిన ఏరియాలో 100 మీటర్ల వరకు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. సికింద్రాబాద్ లో ఉన్న 9 కంటైన్మెంట్ జోన్లకు అదనంగా కొత్త జోన్ల ఏర్పాటుకు అధికారులు సిద్ధమవుతున్నారు. కరోనా బారిన పడకుండా ఉండాలంటే కేవలం సామాజిక దూరం పాటించడం, జాగ్రత్తలు తీసుకోవటం మాత్రమే వైరస్ నుండి రక్షిస్తాయని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

Also Read: రైతులకు శుభవార్త: 17 పంటలకు కనీస మద్దతు ధర పెంపు!

Also Read: గుడ్ న్యూస్: టీటీడీ కళ్యాణ మండపాల్లో.. శ్రీవారి లడ్డూ ప్రసాదం..