తెలంగాణ కరోనా బులిటెన్ వచ్చింది.. ఒక్క రోజులో ఎన్ని కేసులంటే…

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 921 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,65,049కి చేరింది. ఇందులో 11,047 యాక్టివ్ కేసులు ఉండగా..

  • Sanjay Kasula
  • Publish Date - 8:51 am, Tue, 24 November 20
తెలంగాణ కరోనా బులిటెన్ వచ్చింది.. ఒక్క రోజులో ఎన్ని కేసులంటే...

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 921 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,65,049కి చేరింది. ఇందులో 11,047 యాక్టివ్ కేసులు ఉండగా.. 2,52,565 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు గడిచిన 24 గంటల్లో 1,097 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, 4 మంది మరణించారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 1437కి చేరింది.

జిల్లాల వారీగా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదిలాబాద్ 6, భద్రాద్రి కొత్తగూడెం 71, జీహెచ్ఎంసీ 146, జగిత్యాల 50, జనగాం 8, జయశంకర్ భూపాలపల్లి 19, గద్వాల్ 5, కామారెడ్డి 11, కరీంనగర్ 44, ఖమ్మం 36, ఆసిఫాబాద్ 9, మహబూబ్ నగర్ 14, మహబూబాబాద్ 15, మంచిర్యాల 18, మెదక్ 9, మేడ్చల్ 81, ములుగు 16, నాగర్ కర్నూల్ 9, నల్గొండ 49, నారాయణపేట 4, నిర్మల్ 8, నిజామాబాద్ 15, పెద్దపల్లి 29, రాజన్న సిరిసిల్ల 27, రంగారెడ్డి 61, సంగారెడ్డి 17, సిద్ధిపేట 18, సూర్యాపేట 31, వికారాబాద్ 7, వనపర్తి 11, వరంగల్ రూరల్ 14, వరంగల్ అర్బన్ 45, యదాద్రి భువనగిరిలో 18 కేసులు నమోదయ్యాయి.