దేశ వ్యాప్తంగా కరోనా కేసులు ఇలా ఉన్నాయి..

కరోనా వ్యాప్తి దేశంలో కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 48,648 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది‌. దీంతో మొత్తం కేసుల సంఖ్య…

  • Sanjay Kasula
  • Publish Date - 11:19 am, Fri, 30 October 20

Coronavirus Cases : కరోనా వ్యాప్తి దేశంలో కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 48,648 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది‌. దీంతో మొత్తం కేసుల సంఖ్య 80,88,851కి చేరింది. నిన్న ఒక్క రోజే 563 మంది మరణించగా ఇప్పటివరకు మొత్తం 1,21,090 మంది కరోనా కబలించింది.

ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.   గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11,64,648 శాంపిళ్లను పరీక్షించామని, ఇప్పటివరకు 10,77,28,088 శాంపిళ్లను పరీక్షించామని డియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ తెలిపింది. నిన్న 57,386 మంది కోలుకుని ఆసుపత్రులనుంచి డిశ్చార్జ్‌ అవ్వగా ఇప్పటి వరకు మొత్తం 73,73,375 మంది కోలుకున్నారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్‌ కేసుల సంఖ్య 5,94,386గా ఉంది. అయితే వైద్యం పొంది డిశ్చార్జీ అవుతున్న వారి సంఖ్య పెరుగుతుండటం అభినందించాల్సిన విషయమే.. అయితే దేశ రాజధాని ఢిల్లీతోపాటు మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.