కరోనా ఎఫెక్ట్‌: క్వారంటైన్‌లో బెంగళూరు పోలీసు కమిషనర్

కర్ణాటకలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరగడమే తప్ప తగ్గుముఖం పట్టడం లేదు. ముఖ్యంగా ఐటీ నగరం బెంగళూరులో పాజిటివ్ కేసులు గత నాలుగు వారాల్లోనే 12.9 శాతం మేర పెరిగాయి. ఇదే సమయంలో...

కరోనా ఎఫెక్ట్‌: క్వారంటైన్‌లో బెంగళూరు పోలీసు కమిషనర్
Follow us

|

Updated on: Jul 18, 2020 | 1:13 PM

కర్ణాటకలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరగడమే తప్ప తగ్గుముఖం పట్టడం లేదు. ముఖ్యంగా ఐటీ నగరం బెంగళూరులో పాజిటివ్ కేసులు గత నాలుగు వారాల్లోనే 12.9 శాతం మేర పెరిగాయి. ఇదే సమయంలో మరణాలు కూడా 8.9 శాతం పెరుగుదల నమోదయ్యింది. ఇక బెంగళూరు నగర పోలీస్‌ కమిషనర్‌ సైతం హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు.

బెంగళూరు నగరంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఇప్పటికే బెంగళూరు నగరంలో 600 మంది పోలీసులకు కరోనా సోకగా, వారిలో ఏడుగురు మరణించినట్లు అక్కడి అధికారులు వివరించారు. తాజాగా, పోలీసు కమిషనర్ డ్రైవరుకు కరోనా పాజిటివ్‌గా తేలిందని అధికారులు వెల్లడించారు. దీంతో పోలీసు కమిషనర్ హోం క్వారంటైన్ లో ఉన్నట్లు తెలిపారు. నాలుగు రోజుల హోం క్వారంటైన్‌ అనంతరం సోమవారం కరోనా టెస్ట్‌ చేయించుకుంటానని కమిషనర్‌ భాస్కర్‌ రావు తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలిపారు. పోలీస్‌ కమిషనర్‌గా విధి నిర్వహణలో భాగంగా తాను కరోనా పాజిటివ్ వ్యక్తులను కలవడంతోపాటు తన డ్రైవరుకు కరోనా వచ్చినందున హోంక్వారంటైన్ లో ఉంటున్నట్లు తెలిపారు. వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో మూడు నెలల్లో తాను ఐదవసారి సోమవారం మళ్లీ కరోనా పరీక్ష చేయించుకోనున్నట్లు కమిషనర్‌ భాస్కర్‌ రావు స్పష్టం చేశారు.