తాజ్‌మహల్ మూసేయాల్సిందే.. కేంద్రానికి ఆగ్రా మేయర్ లేఖ..!

తాజ్ మహల్.. ఉత్తర్ ప్రదేశ్‌లోని ఆగ్రాలో ఉన్న ఈ ప్రాచీన కట్టడం గురించి తెలిసిందే. ప్రపంచంలోని వింతల్లో ఒకటైన ఈ తాజ్‌ను ఇప్పుడు మూసేయాలంటూ ఆగ్రా మేయర్ నవీన్ జైన్ కేంద్రానికి ఓ ప్రతిపాదన పంపారు. అందుకు కారణం లేకపోలేదు. ఈ అందమైన ప్రదేశాన్ని చూసేందుకు దేశీయులే కాకుండా.. అనేక మంది విదేశీ పర్యాటకులు కూడా వస్తుంటారు. దేశ రాజధాని ఢిల్లీకి వచ్చిన వారు.. దాదాపుగా ఈ ప్రదేశాన్ని చూడకుండా వెళ్లరు. ఇటీవల భారత్ టూర్‌కు వచ్చిన […]

తాజ్‌మహల్ మూసేయాల్సిందే.. కేంద్రానికి ఆగ్రా మేయర్ లేఖ..!
Follow us

| Edited By:

Updated on: Mar 07, 2020 | 9:00 PM

తాజ్ మహల్.. ఉత్తర్ ప్రదేశ్‌లోని ఆగ్రాలో ఉన్న ఈ ప్రాచీన కట్టడం గురించి తెలిసిందే. ప్రపంచంలోని వింతల్లో ఒకటైన ఈ తాజ్‌ను ఇప్పుడు మూసేయాలంటూ ఆగ్రా మేయర్ నవీన్ జైన్ కేంద్రానికి ఓ ప్రతిపాదన పంపారు. అందుకు కారణం లేకపోలేదు. ఈ అందమైన ప్రదేశాన్ని చూసేందుకు దేశీయులే కాకుండా.. అనేక మంది విదేశీ పర్యాటకులు కూడా వస్తుంటారు. దేశ రాజధాని ఢిల్లీకి వచ్చిన వారు.. దాదాపుగా ఈ ప్రదేశాన్ని చూడకుండా వెళ్లరు. ఇటీవల భారత్ టూర్‌కు వచ్చిన అగ్రరాజ్యాధిపతి ట్రంప్ కూడా.. తాజ్‌మహల్‌ను సందర్శించిన విషయం తెలిసిందే. అయితే దేశ వ్యాప్తంగా ఇప్పుడు కరోనా టెన్షన్ పట్టుకున్న సంగతి తెలిసిందే.

తాజ్‌మహల్‌‌ను చూసేందుకు నిత్యం విదేశీ పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఆగ్రాకు వస్తున్నారని.. ఒకవేళ వారిలో ఎవరైనా కరోనా బాధితులు ఉంటే.. నగరంలో వ్యాపించే అవకాశాలున్నాయని ఆగ్రా మేయర్ కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. కరోనా వైరస్ పూర్తిగా అదుపులోకి వచ్చే వరకూ.. తాజ్‌మహల్‌‌తోపాటు ఫతేపూర్ సిక్రీ కోట, ఆగ్రాలోని కోట, ఇతర పురాతన కట్టడాలను మూసివేయాలని.. ఇక్కడికి పర్యాటకులు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

మరోవైపు ఇప్పటికే యూపీలో కరోనా వ్యాప్తి చెందకుండా ప్రత్యేక చర్యలు చేపడుతోంది. తాజాగా.. తాజ్‌‌ను సందర్శించేందుకు వచ్చిన 2,915 మంది విదేశీ పర్యాటకులను ఆగ్రా జిల్లా వైద్యాధికారులు పరీక్షించగా.. వారిలో 708 మందిని హోంఐసోలేషన్‌కు తరలించారని అధికారులు తెలిపారు. కాగా.. ముగ్గురు విదేశీ పర్యాటకులకు కరోనా వైరస్ లక్షణాలను గుర్తించిన అధికారులు.. వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు ఆగ్రా వైద్యాధికారులు చెప్పారు.

కోడి గుడ్డు కోసం లక్షలు.. మూడు రోజుల పాటు జరిగిన వేలం..ఎగబడ్డ జనం
కోడి గుడ్డు కోసం లక్షలు.. మూడు రోజుల పాటు జరిగిన వేలం..ఎగబడ్డ జనం
237 స్ట్రైక్‌రేట్‌తో ఊచకోత.. కట్‌చేస్తే.. టీ20 ప్రపంచకప్‌లో చోటు?
237 స్ట్రైక్‌రేట్‌తో ఊచకోత.. కట్‌చేస్తే.. టీ20 ప్రపంచకప్‌లో చోటు?
వన్‌ప్లస్‌ 11పై మరోసారి డిస్కౌంట్‌.. ప్రీమియం ఫోన్‌ ధర ఎంతంటే
వన్‌ప్లస్‌ 11పై మరోసారి డిస్కౌంట్‌.. ప్రీమియం ఫోన్‌ ధర ఎంతంటే
జుట్టుకు హెన్నా పెడుతున్నారా? పెరుగు, నిమ్మ రసం అస్సలు కలపొద్దు
జుట్టుకు హెన్నా పెడుతున్నారా? పెరుగు, నిమ్మ రసం అస్సలు కలపొద్దు
బీజేపీ అభ్యర్థి ఖరారు.. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో త్రిముఖ పోటీ
బీజేపీ అభ్యర్థి ఖరారు.. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో త్రిముఖ పోటీ
డ్యూయల్ రోల్స్‌తో అదరగొట్టనున్న స్టార్ హీరోలు..
డ్యూయల్ రోల్స్‌తో అదరగొట్టనున్న స్టార్ హీరోలు..
బిజినెస్‌ చేసే ఆలోచనలో ఉన్నారా.? ఎప్పుడూ డిమాండ్ ఉండే ప్లాన్‌ ఇది
బిజినెస్‌ చేసే ఆలోచనలో ఉన్నారా.? ఎప్పుడూ డిమాండ్ ఉండే ప్లాన్‌ ఇది
టెన్షన్‌లో తెలియకుండానే తెగ గోళ్లు కొరికేస్తున్నారా.?ఇది మీ కోసమే
టెన్షన్‌లో తెలియకుండానే తెగ గోళ్లు కొరికేస్తున్నారా.?ఇది మీ కోసమే
KKR vs RR Preview: టేబుల్ టాపర్‌పై కన్నేసిన కోల్‌కతా, రాజస్థాన్..
KKR vs RR Preview: టేబుల్ టాపర్‌పై కన్నేసిన కోల్‌కతా, రాజస్థాన్..
టీఎస్‌ఆర్‌జేసీ 2024ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల
టీఎస్‌ఆర్‌జేసీ 2024ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లు విడుదల