భారత్: 97,570 పాజిటివ్ కేసులు, 1,201 మంది మృతి..

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఒకే రోజులో అత్యధికంగా 97,570 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి.దీనితో దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 46,59,984కి చేరింది.

భారత్: 97,570 పాజిటివ్ కేసులు, 1,201 మంది మృతి..
Follow us

|

Updated on: Sep 12, 2020 | 11:01 AM

Coronavirurs In India: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఒకే రోజులో అత్యధికంగా 97,570 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి.దీనితో దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 46,59,984కి చేరింది. గడిచిన 24 గంటల్లో 1,201 మంది చనిపోగా.. మొత్తం మరణాల సంఖ్య 77,472కు చేరుకుంది. ఇక 9,58,316 మంది చికిత్స తీసుకుంటుండగా.. ఇప్పటివరకు 36,24,196 మంది వైరస్ నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే నిన్న ఒక్క రోజు 81,533 మంది డిశ్చార్జ్ అయ్యారు.

అటు మహారాష్ట్రలో కరోనా విలయం సృష్టిస్తోంది. నిన్న ఒక్క రోజే 24,886 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో అక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య 10,15,681కి చేరింది. ఆంధ్రప్రదేశ్‌లో అయితే పాజిటివ్ కేసుల సంఖ్య 5,47,686కి చేరింది. ఉత్తరప్రదేశ్‌లో నిన్న 7,016 కేసులు నమోదు కావడంతో అక్కడ మొత్తం కేసుల సంఖ్య 3 లక్షలకు చేరువైంది. కాగా, దేశంలో ప్రస్తుతం రికవరీ రేట్  77.77 శాతం ఉండగా.. మరణాల రేటు 1.6 శాతంగా ఉంది.

Also Read: 

ఏపీ విద్యార్ధులకు గమనిక.. ఎంసెట్ హాల్‌ టికెట్స్‌ వచ్చేశాయి..

”అంతర్వేది ఘటనలో చంద్రబాబు ప్రమేయం ఉంది”

ఫస్ట్ వీక్ ఎలిమినేషన్స్.. ఆ ముగ్గురిలో ఒకరు ఔట్..!