జనం రోడ్లపైకి..వైరస్ ఇళ్లల్లోకి..!

హైదరాబాద్ లో కరోనా మహమ్మారి వీరవిహారం చేస్తూనే వుంది. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. పరిస్థితి ఇంత తీవ్రంగా వున్నా జనంలో మాత్రం సీరియస్ నెస్ కనిపించడం లేదు.

జనం రోడ్లపైకి..వైరస్ ఇళ్లల్లోకి..!
Follow us

| Edited By:

Updated on: Jun 14, 2020 | 8:07 AM

హైదరాబాద్ లో కరోనా మహమ్మారి వీరవిహారం చేస్తూనే వుంది. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. పరిస్థితి ఇంత తీవ్రంగా వున్నా జనంలో మాత్రం సీరియస్ నెస్ కనిపించడం లేదు. లాక్ డౌన్ సడలింపులు ఇవ్వగానే జనం రోడ్ల మీద పడ్డారు. కరోనా అనేది ఒకటుందనే విషయాన్నే మరచిపోయి ఉరుకులు పరుగులు పెడుతున్నారు. హైదరాబాదులో శనివారం ఒక్కరోజే రోడ్ల మీదకు వచ్చిన జనం సంఖ్య లక్షల్లో వుంటుందని ఒక అంచనా. గట్లు తెగిన నీటి ప్రవాహంలా రోడ్ల మీదకు వస్తున్న జనాన్ని చూసి డాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. ఇలా అయితే చాలా వేగంగా కరోనా వ్యాపించడం ఖాయమని డాక్టర్లు అంటున్నారు. హైదరాబాదు రామ్ నగర్ ఫిష్ మార్కెట్లో చేపలు కొనడానికి జనం వేలంవెర్రిగా రావడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ పరిస్థితి చూస్తే ఇంకెన్ని కేసులు బయటపడతాయోననే భయం పెరుగుతోంది. హైదరాబాద్‌లో మరోమారు కఠినంగా లాక్ డౌన్ విధించే దిశగా ప్రభుత్వం యోచిస్తోందా అనిపిస్తోంది. కరోనా వైరస్‌ను కట్టడి చేయడమన్నది ఇప్పుడు ప్రభుత్వాలకు పెద్ద సవాల్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కేసులు మాత్రం తగ్గడంలేదు. రోజురోజుకూ కేసులు ఇంకా ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. కేసులు మరింతగా పెరిగే అవకాశముందని ప్రభుత్వం కూడా భావిస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ విషయంలో ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకునే దిశగా యోచిస్తున్నట్లుగా ప్రభుత్వవర్గాల నుంచి సమాచారం. కరోనా కట్టడి కోసం హైదరాబాద్‌లో నిబంధనలు కఠినతరం చేయక తప్పని పరిస్థితి ఏర్పడుతోందని అధికారులు చెబుతున్నారు.