ఐసోలేష‌న్ నుంచి త‌ప్పించుకున్న క‌రోనా పేషెంట్‌..అధికారుల్లో టెన్ష‌న్‌

ఐసోలేష‌న్ సెంట‌ర్‌లో ఉండ‌లేక ఓ క‌రోనా పేషెంట్ త‌ప్పించుకుని పారిపోయాడు. వైర‌స్ సోకిన రోగుల ప‌ట్ల

ఐసోలేష‌న్ నుంచి త‌ప్పించుకున్న క‌రోనా పేషెంట్‌..అధికారుల్లో టెన్ష‌న్‌
Follow us

|

Updated on: Apr 30, 2020 | 2:35 PM

ఐసోలేష‌న్ సెంట‌ర్‌లో ఉండ‌లేక ఓ క‌రోనా పేషెంట్ త‌ప్పించుకుని పారిపోయాడు. వైర‌స్ సోకిన రోగుల ప‌ట్ల అధికారులు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని, భోజన వసతి సరిగా లేదని, పరిశుభ్రత పాటించడం లేదని ఆరోపిస్తూ…ఆ వ్యక్తి కాలినడకన 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న‌ తన ఇంటికి వెళ్లిపోయాడు. ఈ సంఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లోని పుణేలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే..
పుణెకు చెందిన 70 ఏళ్ల వ్యక్తికి కరోనా వైరస్ సోకింది. పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో వైద్య సిబ్బంది అతడిని ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. అతడితో పాటు కుటుంబ సభ్యులకు వైరస్ సోకినట్లు పరీక్షల్లో తేలడంతో వారిని సైతం ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. అయితే ఐసోలేషన్ కేంద్రంలో భోజన వసతి సరిగా లేదని, పరిశుభ్రత పాటించడం లేదని కరోనా సోకిన వ్యక్తి ఐసోలేషన్ నుంచి తప్పించుకున్నాడు. అధికారుల క‌ళ్లుగ‌ప్పి ఎలాగోలా ఇంటికి చేరుకున్నాడు. స్థానికులు గ‌మ‌నించి ఆరా తీయ‌గా అస‌లు బాధితుడు అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టాడు. దీంతో వారు వెంట‌నే స్థానిక కార్పొరేటర్‌కు, వైద్య సిబ్బందికి సమాచారం అందజేశారు. హుటాహుటినా అక్క‌డ‌కు చేరుకున్న అధికారులు తిరిగి అత‌న్ని అంబులెన్స్‌లో ఎక్కించి ఐసోలేష‌న్‌కు త‌ర‌లించారు. అయితే, స‌ద‌రు వ్య‌క్తి ఇంటికి వెళ్లే క్ర‌మంలో ఎవ‌రినీ క‌ల‌వ‌లేద‌ని చెప్ప‌డంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.