‘కరోనా కక్కుర్తి’.. అమెరికా ఏం చేసిందంటే…?

కరోనా వైరస్ బీభత్సంతో తల్లడిల్లుతున్న అమెరికా…. వెరైటీ ‘ పైరసీ’ కి తెర తీసింది. చైనాలోని తమ సంస్థ ఫేస్ మాస్కులు తయారు చేయగా.. అవి జర్మనీకి చేరాల్సి ఉన్నప్పటికీ వాటిని బ్యాంకాక్ విమానాశ్రయంలో తానే స్వాధీనం చేసుకుంది. చాకచక్యంగా ఆ ఎయిర్ పోర్టుకు మళ్లించి తనే వాటిని తిరిగి పొందగలిగింది. కరోనాపై జరుగుతున్న వార్ లో ఇదో మోడరన్ పైరసీ అని జర్మనీ ఆరోగ్య శాఖ మంత్రి జెన్స్ స్పాన్ ఆరోపించారు. సుమారు రెండు లక్షల […]

'కరోనా కక్కుర్తి'.. అమెరికా ఏం చేసిందంటే...?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 04, 2020 | 5:16 PM

కరోనా వైరస్ బీభత్సంతో తల్లడిల్లుతున్న అమెరికా…. వెరైటీ ‘ పైరసీ’ కి తెర తీసింది. చైనాలోని తమ సంస్థ ఫేస్ మాస్కులు తయారు చేయగా.. అవి జర్మనీకి చేరాల్సి ఉన్నప్పటికీ వాటిని బ్యాంకాక్ విమానాశ్రయంలో తానే స్వాధీనం చేసుకుంది. చాకచక్యంగా ఆ ఎయిర్ పోర్టుకు మళ్లించి తనే వాటిని తిరిగి పొందగలిగింది. కరోనాపై జరుగుతున్న వార్ లో ఇదో మోడరన్ పైరసీ అని జర్మనీ ఆరోగ్య శాఖ మంత్రి జెన్స్ స్పాన్ ఆరోపించారు. సుమారు రెండు లక్షల మాస్కులు తమ దేశ పోలీసులు వినియోగించాల్సి ఉందని, కానీ ట్రంప్ ప్రభుత్వం ఇలా ఐడియాతో పన్నాగం పన్నిందని ఆయన అన్నారు. బహుశా మాస్కుల ఎగుమతిపై నిషేధం ఉండాలన్న అమెరికన్ ప్రభుత్వ విధానంలో ఇది ఓ భాగమై ఉండవచ్ఛు అని పేర్కొన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు తమ దేశానికి అత్యవసరంగా మాస్కులు వగైరా ప్రొటెక్టివ్ సాధనాలు ఉండాలంటూ ట్రంప్.. ఇందుకు అనువుగా డిఫెన్స్ ప్రొడక్షన్ యాక్ట్ ని అమలులోకి తెచ్చారు. ఈ చట్టం కింద అమెరికన్ సంస్థలు తమ వనరులను తమకే మళ్ళించుకోవచ్చు. ‘మనకు ఇలాంటివి ఎంతయినా అవసరం.. రెండు లక్షల ఎన్ 95 రెస్పిరేటర్లు, ఆరు లక్షల గ్లోవ్స్ మరికొన్ని మెడికల్ పరికరాలు కూడా మన దేశంలోనే ఉండాలి’ అని ఆయన అన్నారు. కాగా జర్మనీలో కూడా కరోనా మరణాలు అధికంగా ఉన్న విషయం గమనార్హం.