Breaking News
  • హైదరాబాద్‌: తార్నాకలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్‌ సదస్సు. పాల్గొన్న గవర్నర్‌ తమిళిసై.
  • ప్రకాశం జిల్లా మార్టూరుకు బయల్దేరిన చంద్రబాబు. ప్రజాచైతన్య యాత్రను ప్రారంభించనున్న చంద్రబాబు.
  • కడప: రాయచోటి వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. పాల్గొన్న ఎంపీ మిథున్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి. పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన ఎంపీ, ఎమ్మెల్యేలు.
  • వరంగల్‌లో వాటర్‌ మెన్‌ ఆఫ్‌ ఇండియా రాజేంద్రసింగ్‌ గోదావరి యాత్ర. కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి రైతులతో సమావేశం. గోదావరి జలాల సద్వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వానికి ప్రశంసలు.
  • అమరావతి: చంద్రబాబు భద్రతను ఉద్దేశపూర్వకంగా తగ్గించారు. అధికార పార్టీ ఇలాంటి చర్యలకు పాల్పడడం తగదు-యనమల రామకృష్ణుడు. ఈ విషయంపై మండలిలో చర్చిస్తాం. అవసరమైతే ప్రివిలేజ్‌ కమిటీకి ఫిర్యాదు చేస్తాం-యనమల రామకృష్ణుడు.
  • నిర్మల్‌: మంచిర్యాలలో ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణలో ఉద్రిక్తత. మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డిని అడ్డుకున్న బీజేపీ నేతలు. టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం, సర్దిచెప్పిన పోలీసులు. మంత్రితో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎంపీ సోయం బాపూరావు.

కరోనా వైరస్.. ఇండియాలో అలర్ట్.. ప్రయాణికులకు ముమ్మరంగా స్క్రీనింగ్

Air India has kept a Boeing 747 jet on standby, కరోనా వైరస్.. ఇండియాలో అలర్ట్.. ప్రయాణికులకు ముమ్మరంగా  స్క్రీనింగ్

చైనాను కబళిస్తున్న కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో క్రమేపీ తన ప్రతాపాన్ని చూపుతోంది. చైనాలో ఇప్పటికే ఈ వైరస్ వ్యాధి సోకి మరణించినవారి సంఖ్య 80 కి పెరగగా.. సుమారు రెండున్నరవేల మంది దీని ప్రభావానికి  గురయ్యారు. కాగా.. ఇండియాలో వైద్య,ఆరోగ్య మంత్రిత్వ శాఖ అప్రమత్తమయింది. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలూ తీసుకుంటున్నట్టు ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ తెలిపారు. ఇప్పటివరకు మన దేశంలో ఈ వ్యాధికి సంబంధించి ఎలాంటి పాజిటివ్ కేసు కూడా కనబడలేదన్నారు. చైనా నుంచి వచ్చిన ఏడుగురు ప్రయాణికుల రక్త నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‌కు పంపినట్టు ఆయన చెప్పారు. అలాగే ఇరవై నాలుగు గంటలూ ఓ కాల్ సెంటర్ పని చేస్తోందన్నారు.  ఈ నెల 1 నుంచి చైనాకు వెళ్లి ఇండియాకు తిరిగి వచ్చిన ప్రయాణికుల్లో ఎవరైనా జ్వరం, దగ్గు, శ్వాస సంబంధ రుగ్మతలతో బాధ పడుతుంటే వెంటనే దగ్గరలోని ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలని హర్ష వర్ధన్ కోరారు. ఇక ఢిల్లీ సహా ముంబై, బెంగుళూరు, హైదరాబాద్, కొచ్చి , కోల్ కతా, చెన్నై విమానాశ్రయాల్లో థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాట్లు చేశారు.

ఇలా ఉండగా కేరళ, మహారాష్ట్రలో సుమారు రెండు వందల మందిని ముందు జాగ్రత్త చర్యగా ]అబ్జర్వేషన్ లో ఉంచారు. కేరళలో 172 మందిని హోం నిఘాలో ఉంచగా.. ఏడుగురిని వివిధ ఆసుపత్రులకు తరలించారు. చైనా నుంచి పాట్నా చేరిన ఒక అమ్మాయిని, అలాగే ఆ దేశం నుంచి రాజస్తాన్ కు వఛ్చిన ఓ డాక్టర్ ను కూడా ఎందుకైనా మంచిదని ఆసుపత్రికి తరలించారు.

Air India has kept a Boeing 747 jet on standby, కరోనా వైరస్.. ఇండియాలో అలర్ట్.. ప్రయాణికులకు ముమ్మరంగా  స్క్రీనింగ్ఢిల్లీలో ప్రధాని మోదీకి  ప్రిన్సిపల్ సెక్రటరీ అయిన పి.కె. మిశ్రా అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆరోగ్య శాఖ అధికారులు.. ఈ వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలను వివరించారు. మరోవైపు.. చైనాలోని వూహాన్ సిటీ నుంచి భారతీయులను తరలించేందుకు ఎయిరిండియా బోయింగ్ 747 విమానాన్ని సిధ్ధంగా ఉంచింది. ప్రభుత్వ నిర్ణయం కోసం తాము ఎదురుచూస్తున్నట్టు వైమానిక దళ అధికారి ఒకరు తెలిపారు.

 

 

 

Related Tags