కరోనా.. ట్రయల్స్ లో ప్రపంచ ఆరోగ్య సంస్థతో చేతులు కలుపుతాం.. ఇండియా

కరోనా వ్యాధి చికిత్సకు మందును కనుగొనడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ జరిపే ట్రయల్స్ లో పాలుపంచుకోవాలని ఇండియా నిర్ణయించుకుంది. ఇప్పటివరకు ఇలాంటి ట్రయల్స్ కు భారత్ దూరంగా ఉంటూ వచ్చింది. కానీ ఈ విధమైన ప్రయోగాలకు  వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ శ్రీకారం చుట్టినప్పుడు తాము కూడా వాటిలో పాల్గొంటామని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్ లోని అంటువ్యాధుల నివారణ విభాగం హెడ్ డాక్టర్ గంగాఖేద్కర్ తెలిపారు. దీన్ని సాలిడారిటీ ట్రయల్ గా వ్యవహరిస్తున్నామన్నారు. ‘లొపినవిర్’, ‘రైటోనవిర్’ […]

కరోనా.. ట్రయల్స్ లో ప్రపంచ ఆరోగ్య సంస్థతో చేతులు కలుపుతాం.. ఇండియా
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 28, 2020 | 3:08 PM

కరోనా వ్యాధి చికిత్సకు మందును కనుగొనడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ జరిపే ట్రయల్స్ లో పాలుపంచుకోవాలని ఇండియా నిర్ణయించుకుంది. ఇప్పటివరకు ఇలాంటి ట్రయల్స్ కు భారత్ దూరంగా ఉంటూ వచ్చింది. కానీ ఈ విధమైన ప్రయోగాలకు  వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ శ్రీకారం చుట్టినప్పుడు తాము కూడా వాటిలో పాల్గొంటామని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్ లోని అంటువ్యాధుల నివారణ విభాగం హెడ్ డాక్టర్ గంగాఖేద్కర్ తెలిపారు. దీన్ని సాలిడారిటీ ట్రయల్ గా వ్యవహరిస్తున్నామన్నారు. ‘లొపినవిర్’, ‘రైటోనవిర్’ అనే మందుల మిశ్రమంతో కూడిన’రెమ్ డెసివర్’ , ఇంటర్ఫెరాన్ బెటా, క్లోరోక్విన్ కాంబినేషన్ మందులతో ఈ పరీక్షలను నిర్వహించే అవకాశం ఉందని, ప్రస్తుతం అనేక ఆసుపత్రుల్లో రెమ్ డెసివర్ మెడిసిన్ ని ఎక్కువగా వాడుతున్నారని ఆయన చెప్పారు. ఇప్పుడు ముఖ్యమైనది…  ఏ డ్రగ్, లేదా ఏ వ్యాక్సీన్ పని చేస్తుందో అన్న విషయాన్ని మేం నిశితంగా పరిశీలిస్తున్నాం.. ట్రయల్స్ సందర్భంగా ఈ మందుల అంశాన్ని కూడా చేర్చాలా అన్నదే ప్రధానం అని గంగాఖేద్కర్ వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు 30 వ్యాక్సీన్ గ్రూపులను వైద్యులు అధ్యయనం చేస్తున్నారని, వీటిలో 5 ఎనిమల్ టాక్సిసిటీ స్టడీలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అంటే ప్రయోగాత్మకంగా జంతువులపై ప్రయోగించే దశలో ఉన్నాయన్నారు. భారత జనాభాకు అనువైన మందులను కనుగొనే క్రమంలో సరైన సమయంకోసం వేచిచూస్తున్నామని ఆ డాక్టర్ వివరించారు.

దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.