Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 45 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 145380. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 80722. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 60491. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 4167. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • కరోనా తెలంగాణా బులిటిన్. ఇవ్వాళ తాజాగా 71 పాజిటివ్ కేసులు నమోదు. మొత్తం రాష్ట్రంలో 1991 కరోనా పాజిటివ్ కేసులు . ఇవ్వాళ మృతులు 1. మొత్తం ఇప్పటివరకు 57 మంది కరోనా కు బలి అయ్యారు. యాక్టీవ్ కేసులు 650 మంది చికిత్స పొందుతున్నారు.
  • ఈ రోజు ఒకరికి CRPF జవాన్ కి కరోనా పాజిటివ్ ఉన్నట్లు దృవీకరించిన వైద్యులు. దేశ వ్యాప్తంగా మొత్తం 369 CRPF సిబ్బందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు దృవీకరణ 141 యాక్టీవ్ కేస్ లు. 226 మంది డిశ్చార్జ్. ఇద్దరు మృతి.
  • అమరావతి: రేపు ,ఎల్లుండి టిడిపి మహానాడు. రేపు ఉదయం 10.30 కు మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించనున్న చంద్రబాబు. ప్రతినిధులను ఉద్దేశించి ప్రారంభ ఉపన్యాసం ఇవ్వనున్న టిడిపి అధినేత చంద్రబాబు. కరోనా, లాక్ డౌన్ నిబంధనలు నేపథ్యంలో జూమ్ ద్వారా ఆన్ లైన్ లో మహానాడు నిర్వహణ. ఆన్ లైన్ ద్వారా మహానాడు లో పాల్గొననున్న 14 వేల మంది ప్రతినిధులు. 14 తీర్మానాలను ఆమోదించనున్న మహానాడు.
  • అమరావతి: అధికార వికేంద్రీకరణ బిల్లు పరిశీలనకు మండలి చైర్మన్ సెలెక్ట్ కమిటీ వేయాలని ఆదేశించిన అమలు కావడం లేదని హైకోర్టులో పిటిషన్ వేసిన టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి. 8 మంది సభ్యులతో కమిటీ వేయాలని మండలి చైర్మన్ ఆదేశించినా మండలి కార్యదర్శి అమలు చేయడం లేదని పిటిషన్ లో తెలిపిన దీపక్ రెడ్డి. నేడు విచారణ జరపనున్న హైకోర్టు.
  • హైకోర్టు జడ్జీలను కించపరుస్తూ పెట్టిన పోస్టులను హైకోర్టు సుమోటోగా స్వీకరించటంపై హర్షం వ్యక్తంచేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. ప్రభుత్వం చేస్తున్న తప్పులను హైకోర్టు అడ్డుకుంటే ప్రజా ప్రతినిధులయ్యుండి సిగ్గులేకుండా హైకోర్టు వ్యతిరేకంగా పోస్టులు పెడతారా? హైకోర్టు జడ్జిలపై పోస్టులను హైకోర్టు సుమోటోగా స్వీకరించి 49 మందికి నోటీసులు జారీ చేసింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి తొట్టిగ్యాంగ్ ను ప్రోత్సహించటం సరికాదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే కేసులు పెడుతున్న ప్రభుత్వం హైకోర్టు జడ్జిలపై పోస్టులు పెట్టే వారిని ఎందుకు కాపాడుతున్నది? పోస్టులు పెట్టిన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలి - రామకృష్ణ.

‘అత్యవసర దేశాలకు మందులను వెంటనే పంపుతాం’.. ఇండియా

కోవిడ్-19 మహమ్మారితో తీవ్ర జన నష్టాన్ని ఎదుర్కొంటున్న అత్యవసర  దేశాలకు వాటికి అవసరమైన మందులను వెంటనే పంపుతామని భారత్ ప్రకటించింది. ముఖ్యంగా కరోనా చికిత్సలో వాడే మలేరియా నివారణ మందు...
corona virus.. govt. says will supply essential drugs to some nations, ‘అత్యవసర దేశాలకు మందులను వెంటనే పంపుతాం’.. ఇండియా

కోవిడ్-19 మహమ్మారితో తీవ్ర జన నష్టాన్ని ఎదుర్కొంటున్న అత్యవసర  దేశాలకు వాటికి అవసరమైన మందులను వెంటనే పంపుతామని భారత్ ప్రకటించింది. ముఖ్యంగా కరోనా చికిత్సలో వాడే మలేరియా నివారణ మందు హైడ్రాక్సీక్లోరోక్విన్ ను తమకు పంపాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రధాని మోదీని కోరిన సంగతి తెలిసిందే. ఒకవేళ ఈ మెడిసిన్ ని పంపడానికి నిరాకరించిన పక్షంలో.. తాము ప్రతీకార చర్యకు దిగ వచ్చునని ఆయన పరోక్షంగా హెచ్చరించారు. ఈ మెడిసిన్ కరోనా చికిత్సకు బాగా పని చేస్తుందని నిపుణులు స్పష్టం చేయడంతో దీని ఎగుమతిని భారత్ రెండువారాల క్రితం నిలిపివేసింది. కాగా-అమెరికా, ఇండియా దేశాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని, అయితే తమ అభ్యర్థనను మోదీ నిరాకరించిన పక్షంలో తాను ఆశ్చర్యపోతానని ట్రంప్ అన్నారు. ఇతర దేశాలకు దీని ఎగుమతిని ఇండియా నిలిపివేసిందన్న విషయం తమకు తెలుసునన్నారు. అనేక సంవత్సరాలుగా వాణిజ్యానికి సంబంధించి ఇండియాకు తమ దేశం ఎంతో తోడ్పడిందన్నారు. ఈ మెడిసిన్ ని ఆయన ‘గేమ్ చేంజర్’ గా అభివర్ణించారు. అయితే ఇది కరోనా చికిత్సకు ఖఛ్చితంగా పని చేస్తుందా అన్న విషయం ఇంకా నిర్ధారణ కావలసి ఉందన్నారు.

 

 

Related Tags