Breaking News
  • కరోనా అప్డేట్ తెలంగాణలో ఇవాళ కొత్తగా 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదు. తెలంగాణ లో ఇప్పటి వరకు 487 కరోనా పాజిటివ్ కేసులు . ఇప్పటి వరకు మొత్తం 12 మంది మృతి చెందారు. పాజిటివ్ కేసుల నుంచి 45 మందికోలుకుని..డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 430 యాక్టీవ్ పాజిటివ్ కేసులు ఉన్నాయి.
  • మై హోం గ్రూప్ సంస్ధల విరాళం. కరోనా ని ఎదుర్కోవడానికి తెలంగాణ ప్రభుత్వానికి సాయమందించిన మై హోం గ్రూప్. ముఖ్యమంత్రి కెసిఆర్ ని కలిసి 3 కోట్ల రూపాయల చెక్ ని అందించిన మై హోం ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరక్టర్ జూపల్లి రామ్, శ్యామ్ రావు .
  • అమరావతి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకం నిబంధనలు మార్పు చేస్తూ ప్రభుత్వం పంపిన ఆర్డినెన్స్ కు ఆమోదం తెలిపిన గవర్నర్... వెంటనే ఆర్డినెన్స్ పై జీవో జారీ చేసిన ప్రభుత్వం
  • ఈరోజు ముంబై లో 218 కరోనా పాజిటివ్ కేస్ లు, 10 మంది మృతి ఇప్పటి వరకు ముంబై లో 993 చేరిన కరోనా పాజిటివ్ కేసులు.
  • భారత్‌లో కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ లేదని తేల్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ. గతంలో ఇచ్చిన నివేదికలో కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ ఉందని పేర్కొన్న డబ్ల్యూహెచ్ఓ. అది పొరపాటుగా అంగీకరిస్తూ సవరణ చేసిన డబ్ల్యూహెచ్ఓ. దేశంలో కేవలం క్లస్టర్లుగా మాత్రమే కేసులున్నాయని వివరణ.

కరోనా భయం..చైనాకు బయల్దేరిన ఎయిరిండియా విమానం

Air India special flight will today depart from Delhi airport to Wuhan, కరోనా భయం..చైనాకు బయల్దేరిన ఎయిరిండియా విమానం

కరోనా వైరస్ ఔట్ బ్రేక్ తో భారత్ మరింత అప్రమత్తమైంది. ఈ వైరస్ పుట్టిన చైనాలోని వూహాన్ సిటీలో చిక్కుబడిన సుమారు 400 మంది భారతీయులను స్వదేశానికి తిరిగి తీసుకురానున్నారు. ఇందుకోసం ఓ ప్రత్యేక ఎయిరిండియా విమానం శుక్రవారం ఢిల్లీ నుంచి చైనాకు బయల్దేరింది.  ఇది ఆరు గంటలపాటు ప్రయాణించి చైనా చేరుకుంటుంది. ఈ బృహత్ ప్రయత్నంలో కొన్ని ముఖ్యమైన పాయింట్లు..

వూహాన్ నుంచి ఇక్కడికి తెచ్చే భారతీయులను ఢిల్లీ, హర్యానాలోని మానెసార్ లలో గల ఆసుపత్రుల్లో 14 రోజులపాటు ఐసోలేషన్ సెంటర్లలో ఉంచుతారు. అక్కడ వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇన్ఫెక్షన్ ముప్పు లేకుండా చూసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటారు. ఈ విమానంలో 5 గురు డాక్టర్లు, ఓ పారా మెడిక్ ఉంటారు. గ్లోవ్స్, మాస్కులు, అవసరమైన మందులు అందుబాటులో ఉంటాయి. వైద్యులు, సిబ్బంది అంతా పూర్తి ప్రొటెక్టివ్ మాస్కులు ధరిస్తారు. వూహాన్ లో కరోనా సోకనివారినే విమానం ఎక్కేందుకు అనుమతిస్తారు.

ఇక పైలట్లు, వైద్యులు, ఇంజనీర్లు, సిబ్బంది తిరిగి వఛ్చిన అనంతరం వారి ఇళ్ల లోనే వారం రోజులపాటు వేరుగా ఉండాల్సి ఉంటుంది. వీరిలో ఎవరికైనా కరోనా వైరస్ సోకిన లక్షణాలు కనిపించిన పక్షంలో.. వెంటనే ఐసోలేషన్ వార్డుకు తరలిస్తారు. ప్రస్తుతం గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించిన నేపథ్యంలో.. ఈ ఉదయం వరకు ఈ వ్యాధి కారణంగా సుమారు 200 మంది మరణించినట్టు అంచనా. వూహాన్ నుంచి కేరళ వచ్చిన ఓ మహిళను త్రిసూర్ లోని ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అలాగే ఆ రాష్ట్రంలో దాదాపు 700 మందిపై వైద్య సంబంధ నిఘా ఉంది. కాగా-మన ఎయిరిండియా విమానం వూహాన్ సిటీలో సుమారు రెండు, మూడు గంటలపాటు ఉంటుంది. రేపు తెల్లవారుజామున రెండు గంటలకు తిరిగి భారత్ బయల్దేరుతుంది.

 

 

 

Related Tags