“రాష్ట్రాలు కరోనా టీకా సేక‌రించవ‌ద్దు”

క‌రోనా‌ వ్యాక్సిన్‌పై ఏర్పాటైన నిపుణుల కమిటీ బుధవారం ఢిల్లీలో మీటింగ్ నిర్వ‌హించింది. నీతి ఆయోగ్ మెంబ‌ర్ వీకే పాల్‌ నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీ కోవిడ్ వ్యాక్సిన్‌ అడ్మినిస్ట్రేషన్‌పై కీలకంగా డిస్క‌స్ చేసింది.

రాష్ట్రాలు కరోనా టీకా సేక‌రించవ‌ద్దు
Follow us

|

Updated on: Aug 12, 2020 | 9:13 PM

క‌రోనా‌ వ్యాక్సిన్‌పై ఏర్పాటైన నిపుణుల కమిటీ బుధవారం ఢిల్లీలో మీటింగ్ నిర్వ‌హించింది. నీతి ఆయోగ్ మెంబ‌ర్ వీకే పాల్‌ నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీ కోవిడ్ వ్యాక్సిన్‌ అడ్మినిస్ట్రేషన్‌పై కీలకంగా డిస్క‌స్ చేసింది. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చే సూచనలు క‌నిపిస్తుండ‌టంతో వ్యాక్సిన్ల లభ్యత, చేరవేసే విధానం, సరఫరా, పాటించాల్సిన ప‌ద్ద‌తులు, మౌలిక సదుపాయాలపై నిపుణులు చర్చించారు. పలు సంస్థలు టీకా తయారీకి చేస్తున్న కృషి గురించి మాట్లాడారు. ఆయా సంస్థల్లో పరిశోధనలు ఏ స్థాయిలో ఉన్నాయో రివ్యూ చేశారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్ల గురించి జాతీయ సాంకేతిక సలహా టీమ్ నుంచి వివరాలు కోరారు.

వ్యాక్సిన్‌ ప్రక్రియను ట్రాక్‌ చేయడానికి ఉన్న ప‌ద్ద‌తుల‌ను కూడా నిపుణుల బృందం చర్చింది. మ‌న దేశంలో, విదేశాల్లో త‌యారైన‌ వ్యాక్సిన్ల సేకరణ, ప్రజలకు చేరువ చేయడానికి మార్గదర్శకాలపై, ఆర్థిక వనరులపై టీమ్ ఫోక‌స్ పెట్టింది. స్టేట్స్ తమ మార్గాల ద్వారా టీకా సేకరణ చేయొద్దని అన్ని రాష్ట్రాలకు నీతి ఆయోగ్‌ నిపుణుల బృందం సూచించింది.