దిగివస్తున్న పసిడి.. బంగారం ఎంత తగ్గిందో తెలుసా..

బంగారం ధరలు దిగొస్తున్నాయి. కరోనా ప్రభావంతో రికార్డు స్థాయిలో 59,130 రూపాయల మార్క్‌ను తాకిన గోల్డ్‌.. ఇప్పుడు మూడువేలు తగ్గి 56, 240కి చేరుకుంది. కరోనాకు వ్యాక్సిన్‌ను తీసుకొస్తున్నామని రష్యా ప్రకటించడం..,

దిగివస్తున్న పసిడి.. బంగారం ఎంత తగ్గిందో తెలుసా..
Follow us

|

Updated on: Aug 20, 2020 | 5:14 PM

Gold price drops : బంగారం ధరలు దిగొస్తున్నాయి. కరోనా ప్రభావంతో రికార్డు స్థాయిలో 59,130 రూపాయల మార్క్‌ను తాకిన గోల్డ్‌.. ఇప్పుడు మూడువేలు తగ్గి 56, 240కి చేరుకుంది. కరోనాకు వ్యాక్సిన్‌ను తీసుకొస్తున్నామని రష్యా ప్రకటించడం.., ఇతర వ్యాక్సిన్‌లు త్వరలోనే మార్కెట్లోకి వస్తున్నాయనే సంకేతాలు రావడం పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇటు యూఎస్‌ ఫెడ్‌ రిజర్వ్‌ కూడా తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు అందజేస్తామని ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లలో అనుకూలత కనిపించింది. ఈ పరిణామాలన్నీ గోల్డ్‌ ధరల తగ్గుదలకు దారితీశాయి.

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం పది గ్రాములు 56,240 పలుకుతుంటే, 22 క్యారెట్ల బంగారం పది గ్రాములు 51,560గా ఉంది. బంగారంతోపాటు వెండి ధరలు కూడా భారీగా పడిపోయాయి. ప్రస్తుతం హైదరాబాద్‌ మార్కెట్లో కిలో వెండి ధర 68 వేల 100 రూపాయలుగా ఉంది. ఆగస్టు ఏడో తేదీతో పోలిస్తే ఇప్పుడు వెండి ధర కిలోకి మూడు వేల రూపాయలు తగ్గింది.