కరోనా కట్టడికి టీటీడీ ముందస్తు చర్యలు..

లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా తిరుమల శ్రీవారి వారి దర్శనానికి భక్తులకు అనుమతిస్తుండడంతో రద్దీ పెరిగిపోయింది. దీంతో టీటీడీ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. తిరుమలకు వచ్చే భక్తులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తోంది. ఇక..

కరోనా కట్టడికి టీటీడీ ముందస్తు చర్యలు..
Follow us

|

Updated on: Jun 30, 2020 | 6:21 PM

తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ భూతం కోరలు చాస్తోంది. వైరస్ వ్యాప్తి శరవేగంగా విస్తరిస్తూ..పిట్టల్లా ప్రాణాలు పోతున్నాయి. కరోనా నియంత్రణకు ప్రభుత్వాలు కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలు అమలు చేస్తున్నప్పటికీ వైరస్ అదుపులోకి రావటంలేదు. ఇటువంటి తరుణంలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు పలు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ద్వారా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పలు జాగ్రత్తలు పాటిస్తున్నారు. సిబ్బందికి రోజూ కరోనా టెస్టులు నిర్వహించడమే కాకుండా, టీటీడీలో ప్రత్యేకించి కోవిడ్ ఆస్పత్రి ఏర్పాటు చేసేందుకు ఆలోచన చేస్తున్నారు.

లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా తిరుమల శ్రీవారి వారి దర్శనానికి భక్తులకు అనుమతిస్తుండడంతో రద్దీ పెరిగిపోయింది. దీంతో టీటీడీ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. తిరుమలకు వచ్చే భక్తులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తోంది. ఇక ఉద్యోగుల ఆరోగ్య దృష్య్టా రోజుకు వంద మంది ఉద్యోగులకు కోవిడ్‌ పరీక్షలు చేయాలని నిర్ణయించినట్లు టీటీడీ ఈవో అనిల్ సింఘాల్ తెలిపారు. ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా వెంటిలేటర్లు ఏర్పాటు చేయాలనే నిర్ణయం కూడా తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు తిరుమలలోని బర్డ్ ఆస్పత్రిని కరోనా రోగులకు ఉపయోగించేలా నిర్ణయం తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.