Breaking news: ఇక సెకన్లలోనే కరోనా టెస్టు రిజల్ట్ !

కరోనా వైరస్ సోకిన వ్యక్తిని గుర్తించేందుకు ఇకపై కేవలం కొన్ని సెకెండ్ల కాలమే పట్టొచ్చు. కొద్ది సెకెన్లలోనే కరోనా టెస్టు ఫలితాన్ని వెల్లడించే కొత్త డివైస్‌ను శాస్త్రవేత్తను ఆవిష్కరించినట్లు సమాచారం. కొద్దిపాటి శిక్షణతో ఈ డివైస్ ఆధారంగా కరోనా ఫలితాన్ని వెల్లడించవచ్చని ప్రవాస భారతీయ వైద్యుడు ఒకరు వెల్లడించారు.

Breaking news: ఇక సెకన్లలోనే కరోనా టెస్టు రిజల్ట్ !
Follow us

|

Updated on: May 21, 2020 | 3:10 PM

New corona testing device invented in Abudabi: ప్రపంచం వ్యాప్తంగా ప్రస్తుతం ఎవరు ఎక్కడ ఏం విన్నా అది కరోనా వైరస్ గురించే. ప్రతి ఒక్కరూ బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను కాపాడుకోవడానికి అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికి ఎలాగో అలాగా కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తూనే వుంది. ముఖ్యంగా మన దేశంలో లాక్ డౌన్ ఉన్నప్పటికీ కరోనా వైరస్ రోజు రోజుకి చాపకింద నీరులా పాకుతూనే వుంది. ఇప్పటికే లక్ష కరోనా పాజిటివ్ కేసులు దేశంలో నమోదయ్యాయి. ముందు ముందు మరిన్ని కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతాయని అంఛనాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తి తగ్గాలి అంటే.. కరోనా టెస్టు ఫలితాలు వేగంగా రావాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలో అబుదాబిలో కరోనా వైద్య పరీక్ష ఫలితాలు సెకండ్లలోనే తేలే పరికరాన్ని కనిపెట్టారన్న వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో.. కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ కనుక్కోవడానికి అనేక దేశాలు ప్రయత్నిస్తున్నాయి. వ్యాక్సిన్ రావాలి అంటే చాలా నెలలు పట్టే పరిస్థితి కనిపిస్తోంది. ఈలోగా కరోనా వైరస్ వ్యాప్తి ని నియంత్రించాలంటే కరోనా వైరస్ ఉన్న వ్యక్తిని ముందుగా కనిపెట్టి, అతనికి వైద్యం అందించాల్సి వుంటుంది. దాంతో వేగంగా ఫలితం తేలే కరోనా టెస్టు కిట్ల రూపకల్పనపై పలు దేశాలు దృష్టి సారించాయి. కరోనా వైరస్ సోకిన వారిని వేగంగా గుర్తిస్తే.. కనీసం వారి కుటుంబ సభ్యులకు వైరస్ సోకకుండా జాగ్రత్తలు చేపట్టవచ్చు.

ఈ నేపథ్యంలో కరోనా పరీక్షా ఫలితాలు సెకన్లలో వచ్చేలా ఒక డివైస్ ని అభివృద్ధి చేసామని ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ కంపెనీ వైద్య-పరిశోధనా విభాగమైన క్వాంట్‌లేస్ ఇమేజింగ్ ల్యాబ్, ఐహెచ్సీ ప్రకటించింది. ఈ పురోగతితో మాస్-స్కేల్ స్క్రీనింగ్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని తెలుస్తోంది. జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం నుండి వచ్చిన తాజా డేటా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసుల సంఖ్య 5 మిలియన్లు (50 లక్షలు)కు పెరిగింది. మరణాల సంఖ్య 3 లక్షలు దాటుతోంది. యుఎఇలో కరోనా కేసులు 25వేలు నమోదయ్యాయి.

యూఏఈ అభివృద్ధి చేసిన పరికరాన్ని పరీక్షించడానికి క్వాంట్‌లేస్‌తో ట్రయల్స్ పురోగతిని నిశితంగా పరిశీలిస్తున్నారు అధికారులు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని చూడటం తమకు గర్వంగా ఉందని, ఇది మన ప్రజల ఆరోగ్యాన్ని రక్షించడానికి సహాయపడుతుందని అబుదాబి ఆరోగ్య శాఖ మంత్రి అబ్దుల్ రెహ్మాన్ బిన్ మొహమ్మద్ బిన్ నాజర్ అల్ ఒవైస్ వెల్లడించారు.

కరోనా వైరస్ సోకిన రక్తం యొక్క కణ నిర్మాణంలో మార్పును అధ్యయనం చేసుకొని… సీఎంఓఎస్ డిటెక్టర్‌ను ఉపయోగించే పరికరాలు, ఫలితాలతో మాస్-స్కేల్ స్క్రీనింగ్‌నుఉపయోగించి…సెకన్లలోనే కరోనా పరీక్ష ఫలితాలు తెప్పిస్తారని తెలుస్తోంది. వాస్తవానికి, ఆప్టికల్-ఫేజ్ మాడ్యులేషన్ ఆధారంగా లేజర్-ఆధారిత డిపిఐ (డిఫ్రాక్టివ్ ఫేజ్ ఇంటర్ఫెరోమెట్రీ) టెక్నిక్ కొన్ని సెకన్లలోనే సంక్రమణ సిగ్నేచర్ ఇవ్వగలదని డాక్టర్ చెప్పారు.

యూజర్ ఫ్రెండ్లీ.. నాన్ ఇన్వాసివ్ రేట్ తక్కువ..

ఈ పరికరం ఆసుపత్రులలోనే కాకుండా, సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్ వంటి బహిరంగ ప్రదేశాలలో ఉపయోగించడానికి అనుకూలంగా ఉంటుందని తెలుస్తోంది. కానీ దీన్ని వినియోగించేందుకు కొద్దిపాటి శిక్షణ అవసరం అవుతుందని సమాచారం. ఈపరికరం కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు ఎంత గానో ఉపయోగ పడుతుందని, కొద్దిగా శిక్షణ ఉంటే దీనిని ఇంటి దగ్గర కూడా టెస్ట్ చేసుకోవచ్చని పరిశోధకుల బృందానికి నాయకత్వం వహిస్తున్న డాక్టర్ ప్రమోద్ కుమార్ వెల్లడించారు.