వరల్డ్ అప్డేట్: కరోనా మరణాలు @ 9.20 లక్షలు..

Corona Cases In World: ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. దేశాలన్నీ కూడా దశల వారీగా అన్ లాక్ ప్రక్రియను మొదలుపెట్టడంతో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు ఈ వైరస్ 213 దేశాలకు పాకింది. తాజా సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 28,700,866 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 920,549 మంది కరోనాతో చనిపోయారు. ఇదిలా ఉంటే 20,610,943 ఈ వైరస్ బారి నుంచి కోలుకుని ఆసుపత్రి […]

వరల్డ్ అప్డేట్: కరోనా మరణాలు @ 9.20 లక్షలు..
Follow us

|

Updated on: Sep 12, 2020 | 6:39 PM

Corona Cases In World: ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. దేశాలన్నీ కూడా దశల వారీగా అన్ లాక్ ప్రక్రియను మొదలుపెట్టడంతో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు ఈ వైరస్ 213 దేశాలకు పాకింది. తాజా సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 28,700,866 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 920,549 మంది కరోనాతో చనిపోయారు.

ఇదిలా ఉంటే 20,610,943 ఈ వైరస్ బారి నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో ప్రపంచంలో అత్యధికంగా 3,10,676 పాజిటివ్ కేసులు, 5807 మరణాలు సంభవించాయి. అమెరికా, బ్రెజిల్, రష్యా దేశాల్లో కరోనా తీవ్రతరంగా ఉంది. అగ్రరాజ్యం అమెరికాలో అత్యధిక కేసులు(6,639,344), మరణాలు(197,472) సంభవించాయి. ఇక భారత్‌లో కరోనా కేసులు 4,665,469 నమోదు కాగా, మృతుల సంఖ్య 77,548కి చేరింది.

Also Read: 

ఏపీ విద్యార్ధులకు గమనిక.. ఎంసెట్ హాల్‌ టికెట్స్‌ వచ్చేశాయి..

”ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ సప్లై.. 8 వేల జంబో జెట్‌లు అవసరం”

ఏపీ: నీట్ అభ్యర్థుల కోసం రెండు ప్రత్యేక రైళ్లు… వివరాలివే

పేద విద్యార్థుల పాలిట దేవుడిగా మారిన సోనూసూద్…