ఏపీ కరోనా బులిటెన్.. ఈ రోజు కొత్తగా ఎన్ని కేసులంటే.!

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,452 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,38,363కి చేరింది.

ఏపీ కరోనా బులిటెన్.. ఈ రోజు కొత్తగా ఎన్ని కేసులంటే.!
Follow us

|

Updated on: Nov 06, 2020 | 7:18 PM

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,452 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,38,363కి చేరింది. ఇందులో 21,825 యాక్టివ్ కేసులు ఉండగా.. 8,09,770 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న వైరస్ కారణంగా 11 మంది మృతి చెందటంతో.. మొత్తం మరణాల సంఖ్య 6,768కు చేరుకుంది. ఇక నిన్న 2,452 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. నేటితో రాష్ట్రవ్యాప్తంగా 85.07 సాంపిల్స్‌ను పరీక్షించారు.

Also Read: మానవ తప్పిదమే కరోనా ‘సెకండ్ వేవ్’కు కారణం.. తస్మాత్ జాగ్రత్త..

నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 161, చిత్తూరు 253, తూర్పుగోదావరి 401, గుంటూరు 323, కడప 132, కృష్ణా 298, కర్నూలు 23, నెల్లూరు 121, ప్రకాశం 108, శ్రీకాకుళం 71, విశాఖపట్నం 142, విజయనగరం 79, పశ్చిమ గోదావరి 298 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. కాగా, తూర్పుగోదావరి జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,18,015కి చేరింది. అలాగే చిత్తూరులో అత్యధికంగా 792 మంది కరోనాతో మరణించారు.

Also Read: పాకిస్థాన్‌లో హిందువులపై మూక దాడి.. రక్షించిన ముస్లింలు..