తెలంగాణ సచివాలయంలో మరొకరికి కరోనా పాజిటివ్

తెలంగాణలో కరోనా రోజు రోజుకు విజృంభిస్తోంది. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారలు ఒకరి తర్వాత ఒకరు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా తెలంగాణ సచివాలయం కార్యకలాపాలు నిర్వహిస్తున్న బీఆర్కే భవన్‌లో మరోసారి కరోనా కలకలం రేపింది. ఇప్పటికే కొందరు ఉద్యోగులు వైరస్ బారిన పడటంతో సంబంధిత శాఖల కార్యాలయాలు మూతపడ్డాయి. మిగతా శాఖల్లోనూ తక్కువ మంది ఉద్యోగులు విధులకు హాజరవుతున్నారు. ఇటీవలే ఆర్థిక శాఖలో అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఇద్దరు సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో […]

తెలంగాణ సచివాలయంలో మరొకరికి కరోనా పాజిటివ్
Follow us

|

Updated on: Jun 19, 2020 | 5:22 PM

తెలంగాణలో కరోనా రోజు రోజుకు విజృంభిస్తోంది. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారలు ఒకరి తర్వాత ఒకరు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా తెలంగాణ సచివాలయం కార్యకలాపాలు నిర్వహిస్తున్న బీఆర్కే భవన్‌లో మరోసారి కరోనా కలకలం రేపింది. ఇప్పటికే కొందరు ఉద్యోగులు వైరస్ బారిన పడటంతో సంబంధిత శాఖల కార్యాలయాలు మూతపడ్డాయి. మిగతా శాఖల్లోనూ తక్కువ మంది ఉద్యోగులు విధులకు హాజరవుతున్నారు.

ఇటీవలే ఆర్థిక శాఖలో అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఇద్దరు సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో ఆ శాఖలోని ఉద్యోగులెవరూ ఆఫీసుకు రావడంలేదు. మిగతా ఉద్యోగులు సైతం అత్యవసరమైతేనే  కార్యాలయానికి వస్తున్నారు. తాజాగా మైనార్టీ సంక్షేమ శాఖకు చెందిన ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు బీఆర్కే భవన్ ప్రవేశ ద్వారాల వద్ద థర్మల్ స్కానర్ కెమెరాలతో పరీక్షించాకే సిబ్బందిని లోపలికి అనుమతిస్తున్నారు. జీహెచ్ఎంసీ సిబ్బంది తరచూ రసాయనాలను పిచికారీ చేస్తున్నారు. దీంతో మొత్తం బీఆర్కే భవన్‌లో ఇప్పటికి ఆరు కేసులు నమోదయ్యాయి.