ఒంగోలు జీజీహెచ్ భవనంపై నుండి దూకి కరోనా రోగి ఆత్మహత్య

ఒంగోలు జీజీహెచ్ భవనం మూడవ అంతస్థుపై నుండి దూకి కరోనా పాజిటివ్ రోగి బట్టగిరి రాధాకృష్ణా రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. జీజీహెచ్‌లోని మేల్ రెసిడెన్సీ క్వార్టర్స్ నుండి ఎక్స్ రే కోసం తీసుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

ఒంగోలు జీజీహెచ్ భవనంపై నుండి దూకి కరోనా రోగి ఆత్మహత్య
Follow us

|

Updated on: Aug 10, 2020 | 10:55 AM

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. కొవిడ్ రోగులు రోజు రోజుకు పెరుగుతున్నారు. ఈ క్రమంలో వైద్యులు సైతం 24 గంటలు సేవలు అందిస్తున్నారు. కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తులను ఐసోలేషన్ వార్డులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్న వ్యక్తులకు వైద్యులు నిరంతరం చికిత్స అందిస్తున్నారు. కానీ కరోనా లక్షణాలతో ప్రజల్లో భయాందోళన విపరీతంగా పెరిగిపోతోంది. కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి .. ఆస్పత్రి భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశంజిల్లాలో జరిగిన ఈ ఘటన జరిగింది.

ఒంగోలు జీజీహెచ్ భవనం మూడవ అంతస్థుపై నుండి దూకి కరోనా పాజిటివ్ రోగి బట్టగిరి రాధాకృష్ణా రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. జీజీహెచ్‌లోని మేల్ రెసిడెన్సీ క్వార్టర్స్ నుండి ఎక్స్ రే కోసం తీసుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడు మానసిక స్థితి సరిగా లేదని కుటుంబసభ్యులు చెబుతున్నారు. మార్కాపురం మండలం దరిమడుగుకు చెందిన రాధాకృష్ణా రెడ్డి మూడు రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతన్ని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు నిర్వహించగా, అతనికి పాజిటివ్‌గా నిర్ధారణ కావటంతో కుటుంబసభ్యులు జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న రాధాకృష్ణా రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.