ఈ పని చేస్తే కరోనా వచ్చినా.. చావు భయం ఉండదు

వీటిని ప్రతీ ఒక్కరు పాటించాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. దీని గురించి ట్వీట్ చేసిన మోదీ...

ఈ పని చేస్తే కరోనా వచ్చినా.. చావు భయం ఉండదు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 07, 2020 | 4:11 PM

ఇంతకాలం భయంకరమైన వ్యాధి అంటే… మనిషిని చంపేసేదని. కానీ కరోనా మనిషిని చంపే చాన్స్‌ చాలా తక్కువ..కానీ, ఎయిడ్స్, క్యాన్సర్ కంటే ఎక్కువగా భయపెడుతోంది. ఎందుకంటే అది వచ్చిన మనిషితో ఆగదు… మనిషిని మనిషికి దూరం చేసే వ్యాధి ఇది. మనిషి ఎంత పిసినారి అయినా, ఎంత పెద్ద వాడు అయినా బేసిక్ గా సంఘజీవి. అందుకే మనిషిని దూరం చేసే ఈ వ్యాధి అంటే అందరికీ భయమే. దీనిని అరికట్టేందుకు కేంద్రం తన శక్తి మేర ప్రయత్నం చేస్తోంది.
తాజాగా కేంద్రం కరోనా వల్ల ప్రాణాపాయం లేకుండా కొన్ని సూచనలు చేసింది. ఆయుష్ మంత్రిత్వ శాఖ ద్వారా ఈ సూచనలు విడుదలయ్యాయి. వీలైనంత‌ ఎక్కువ నీరు తాగాలని పేర్కొంది. 30 నిమిషాల పాటు యోగ, ధ్యానం చేయాలి. ఆహారంలో జీలకర్ర, కొత్తిమీర, వెల్లుల్లి బాగా తీసుకోవాలి. శరీరంలో ఆర్యోగాన్ని పెంచడానికి రోగ నిరోధక శక్తి మెరుగు పరచడానికి ఈ పదార్థాలు ఉపయోగపడతాయని మనల్ని బలవర్థకంగా మారుస్తాయని ఆయుష్ శాఖ పేర్కొంది.
వీటిని ప్రతీ ఒక్కరు పాటించాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. దీని గురించి ట్వీట్ చేసిన మోదీ… మంచి ఆరోగ్యమే మనల్ని కాపాడుతుందని, ఈ సమాచారాన్ని అందరితో పంచుకోవాలని సూచించారు.