మెడ్ టెక్‌లో కరోనా కిట్లు… జగన్ బిజినెస్ ప్లాన్ అదిరింది

కరోనా వైరస్‌తో యావత్ ప్రపంచం గడగడలాడిపోతుంటే.. అదే సమయాన్ని ఆసరాగా మలచుకుని ఏపీని వ్యాపార, వాణిజ్య రంగంలో ఉరకలెత్తించేందుకు సిద్దమవుతోంది జగన్ ప్రభుత్వం. ఇందుకోసం కరోనా రిలేటెడ్ ఉత్పత్తులను గణనీయంగా చేపట్టాలని నిర్ణయించింది.

మెడ్ టెక్‌లో కరోనా కిట్లు... జగన్ బిజినెస్ ప్లాన్ అదిరింది
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 04, 2020 | 5:35 PM

కరోనా వైరస్‌తో యావత్ ప్రపంచం గడగడలాడిపోతుంటే.. అదే సమయాన్ని ఆసరాగా మలచుకుని ఏపీని వ్యాపార, వాణిజ్య రంగంలో ఉరకలెత్తించేందుకు సిద్దమవుతోంది జగన్ ప్రభుత్వం. ఇందుకోసం కరోనా రిలేటెడ్ ఉత్పత్తులను గణనీయంగా చేపట్టాలని నిర్ణయించింది. త్వరలోనే కరోనా కిట్లు, వెంటిలేటర్లు, ఐసొలేషన్ వార్డుల్లో ఉపయోగించే వైద్య పరికరాలను పెద్ద ఎత్తున తయారు చేసి, త్వరలోనే మార్కెట్‌లోకి తీసుకురావాలని తీర్మానించింది..

ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన శనివారం రాష్ట్ర పారిశ్రామిక రంగంపై సమీక్ష జరిగింది. దానికి సంబంధించిన కీలకాంశాలను పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, మత్య్స శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనమ్ మాల కొండయ్య వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ మెడ్ టెక్ జోన్‌లో చాలా కీలకమైన వైద్య పరికరాల తయారీకి ప్రభుత్వం పూనుకుందని తెలిపారు. ఈ జోన్‌ని మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్రాన్ని నిధులు ఆడిగామని, కరోనా వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చాయని తెలిపారు. తాజాగా ఇక్కడ కోవిడ్ కిట్లు, వెంటిలేటర్ల తయారీకి ఆదేశాలు జారీ చేశామని, 15 ఏప్రిల్ నాటికి సరఫరా చేయాల్సిందిగా మెడ్ టెక్ పార్కులోని కొన్ని కంపెనీలను కోరినట్లు చెప్పారు. మెడ్ టెక్ జోన్‌లో ప్రస్తుతం వైద్య పరికరాల ఉత్పత్తి జరుగుతోందని, ఈ పరికరాలను కూడా పరీక్ష చేసేందుకు 13 లాబ్స్ కూడా ఉన్నాయని వివరించారు.

కోవిడ్ కిట్లు, వెంటిలేటర్లను కూడా ఉత్పత్తి చేస్తున్నారని, ఏప్రిల్ 10వ తేదీ నుంచి ఉత్పత్తులు మార్కెట్లోకి వస్తాయని వారన్నారు. మెడ్ టెక్ జోన్ రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో మరిన్ని ఉత్పతుల తయారీ కేంద్రం అవుతుందని తెలిపారు. దేశంలోనే వైద్య పరికరాల ఉత్పత్తిలో మెడ్ టెక్ అత్యంత కీలకం మారబోతోందని వివరించారు. దేశంలో వెంటిలేటర్లు, కరోనా కిట్ల కొరత నెలకొన్న తరుణంలో ఏపీలో మెడ్ టెక్ జోన్‌లో ఇవి తయారు అవుతుండడం చాలా కీలకమని, ఒక్క ఏప్రిల్ నెలలోనే 3 వేల వెంటిలేర్లను తయారు చేస్తున్నామని వివరించారు.

నెలకు 6 వేల కిట్లు మే నెల నుంచి ఉత్పత్తి చేసే అవకాశం ఉందని, అలాగే టెస్టింగ్ కిట్లు 10 వేల వరకు ఈ నెలలో ఉత్పత్తి అవుతాని.. మే నుంచి 25 వేల వరకు తయారు చేయొచ్చని తెలిపారు. మెడ్ టెక్ జోన్ లో సీటీ స్కానర్ ల తయారు అవుతాయని చెప్పారు.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!