Breaking News
  • ఢిల్లీ భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 98 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. 2 లక్షలకు చేరువ లో కరోనా కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 198706. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 97581. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 95526. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 5598. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • "తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నా సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో తమ ప్రాణాలను అర్పించిన అమర వీరుల స్ఫూర్తి మరువలేనిది"- కేంద్ర సహాయక హోంమంత్రి జి.కిషన్ రెడ్డి
  • చెన్నై : తమిళనాడు లో రుతుపవనాల ప్రభావం తో భారీ గా కురుస్తున్న వర్షాలు . తిరువళ్లూరు,కాంచీపురం జిల్లాలతో పాటు వెల్లూర్ ,విరుదునగర్,నీలగిరి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు . పలు చోట్ల రోడ్లన్నీ జలమయం ,ఉరుములు తో కూడిన వర్షాలకు పలు చోట్ల నేలకొరిగిన చెట్లు . తిరువళ్లూరు జిల్లాలో పిడుగుపాటు కి ఒక మహిళ మృతి.
  • టిటిడి : తిరుమలలో శ్రీవారి దర్శనానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. టిటిడి ఉద్యోగాలు, స్థానికులతో ట్రయల్ రన్ నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి. 6 అడుగుల భౌతిక దూరం పాటిస్తూ దర్శనం కల్పించాలని సూచన. టీటీడీ ఈవో లేఖకు స్పందించిన ఏపీ ప్రభుత్వం. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జే.ఎస్.వి ప్రసాద్.
  • ఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ కార్యాలయంలో కరోనా పాజిటివ్. దాదాపు 13 మంది వ్యక్తులకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు దృవీకరించిన అధికారులు లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం.
  • టీవీ9 తో ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ శిశి కళ . ఉస్మానియా మెడికల్ కాలేజీ లో 12 మందికి కోవిడ్ పాజిటివ్. భయం గుప్పెట్లో ఉస్మానియా పీజీలు. ఇప్పటికే రిడింగ్ రూమ్ ను మోసివేసిన కాలేజ్ యాజమాన్యం. ప్రతి ఒక్క పీజీ ని ppe కిట్స్ వెస్కొమని సూచిస్తున్న ప్రిన్సిపల్ శశికళ. జూనియర్ డాక్టర్స్ కు పాజిటివ్ రావటం తో హాస్టల్ ను శానిటేషన్ చేసిన ghmc.

“కరోనా కూడా జ్వరం లాంటిదే..అధైర్య‌ప‌డొద్దు”

CM Jagan Pressmeet On Corona Updates, “కరోనా కూడా జ్వరం లాంటిదే..అధైర్య‌ప‌డొద్దు”

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిపోవడం చాలా బాధ కలిగించే అంశమని ముఖ్యమంత్రి జగన్‌ వ్యాఖ్యానించారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన వారి వల్లనే అనేకమందికి కరోనా వైరస్‌ సోకిందన్నారు. ఢిల్లీ నిజాముద్దీన్‌లో జరిగిన ప్రార్థనలకు హాజరైన ప్రతి ఒక్కరినీ.. వారితో సన్నిహితంగా మెలిగిన వారందరినీ గుర్తించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. కరోనా లక్షణాలు ఉన్నవారిని వెంటనే గుర్తిస్తున్నామని జగన్‌ చెప్పారు. కరోనాతో భయాందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఇది కూడా జ్వరం, ఫ్లూ లాంటిదేనని జగన్‌ పేర్కొన్నారు. ఈ వైరస్‌ సోకకడం పాపంగానో.. తప్పుగానో చూడవద్దని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు జగన్‌. రాష్ట్రంలో 87 కేసులు నమోదయ్యాయని.. ఇందులో 70 కేసుల్లో ఢిల్లీలో మర్కజ్‌లో పాల్గొన్నవారే ఉన్నారని వివరించారు జగన్‌. ఆంధ్రప్రదేశ్‌ నుంచి సుమారు 1085 మంది నిజాముద్దీన్‌కు వెళ్లారని.. అందులో 585 మందికి పరీక్షలు నిర్వహించామని సీఎం చెప్పారు. వీటిల్లో 70 కేసులు పాజిటివ్‌గా వచ్చాయని.. మరో 500 కేసులు పరీక్షలకు పంపామని పేర్కొన్నారు.

కరోనా కారణంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై భారం పడిందన్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి.. కరోనా లక్షణాలు ఉన్నవారు తమ ఆరోగ్య పరిస్థితిని చెప్పాలన్నారు.. 104కు ఫోన్‌ చేసి వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు జగన్‌.. కరోనా సోకిన వారిని చిన్నచూపు చూడవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.. సంక్షోభ సమయంలో సేవలందించాల్సిందిగా ప్రైవేటు సంస్థలను కోరారు జగన్‌.. ఇలాంటి సమయంలో వైద్యులు, నర్సులు, వైద్య కళాశాలలు ముందుకు రావాలన్నారు.. ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు అందరూ సహకరించాలని చెప్పారు జగన్‌.
ఆర్ధిక పరిస్థితిపై భారం పడటంతో వేతనాలు వాయిదా వేసే అవకాశం ఇచ్చి ప్రభుత్వానికి సహకరించిన ప్రజా ప్రతినిధులు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లతోపాటు ఇతర అధికారులు, పెన్షనర్లకు ఈ సందర్భంగా సీఎం జగన్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో వీరి సహకారం మరిచిపోలేనిదని కొనియాడారు. రైతులు, రైతు కూలీలు మధ్యాహ్నం ఒంటి గంట వరకు వ్యవసాయ పనులకు వెళ్లవచ్చన్నారు. కరోనాపై ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు ముఖ్యమంత్రి జగన్‌.

Related Tags