దేశంలో కరోనా విజృంభణ…గడిచిన 24 గంటల్లో 43,082 కొవిడ్‌ కేసులు.. కొత్తగా మరో 492 మంది మహమ్మారికి బలి

దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. గతవారంతో పోలిస్తే ఇప్పుడు కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.  కొత్తగా 43,082 మందికి కొవిడ్​ సోకినట్టు తేలింది.

  • Sanjay Kasula
  • Publish Date - 11:02 am, Fri, 27 November 20

దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. గతవారంతో పోలిస్తే ఇప్పుడు కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.  కొత్తగా 43,082 మందికి కొవిడ్​ సోకినట్టు తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 93,09,788కు పెరిగింది. ఇదే సమయంలో మరో 37,816 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు.

24 గంటల్లో 39,379 కొత్త డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు 87,18,517 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 4,55,555 యాక్టివ్‌ కేసులున్నాయి. కొత్తగా మరో 492 మంది మహమ్మారికి బలవగా.. మరణాల సంఖ్య 1,35,715కి చేరింది.  ఇదిలా ఉండగా.. గురువారం ఒకే రోజు 11,31,204 టెస్టులు నిర్వహించినట్లు  ఐసీఎంఆర్‌ తెలిపింది. ఇప్పటి వరకు మొత్తం 13,70,62,749 టెస్టులు చేసినట్లు వివరించింది.