దేశంలో క‌రోనా ప్ర‌మాద ఘంటిక‌లు.. ఒక్క రోజే 6,088 పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా వీర‌విహారం చేస్తోంది. కేసులు సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. దేశ‌వ్యాప్తంగా క‌రోనా కేసులు ఒక లక్ష 18 వేల మార్క్ ని దాటాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో రికార్డు రేంజ్ లో 6,088 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 148 మంది వైరస్ బ‌లితీసుకుంది. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుద‌ల చేసిన బులెటెన్ ప్ర‌కారం క‌రోనా వివ‌రాలు.. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 118447 దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: […]

దేశంలో క‌రోనా ప్ర‌మాద ఘంటిక‌లు..  ఒక్క రోజే 6,088 పాజిటివ్ కేసులు
Follow us

|

Updated on: May 22, 2020 | 9:37 AM

దేశంలో కరోనా వీర‌విహారం చేస్తోంది. కేసులు సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. దేశ‌వ్యాప్తంగా క‌రోనా కేసులు ఒక లక్ష 18 వేల మార్క్ ని దాటాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో రికార్డు రేంజ్ లో 6,088 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 148 మంది వైరస్ బ‌లితీసుకుంది.

తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుద‌ల చేసిన బులెటెన్ ప్ర‌కారం క‌రోనా వివ‌రాలు..

దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 118447

దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 66330

కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 48534

దేశంలో క‌రోనాతో మృతి చెందిన‌వారి సంఖ్య : 3583

మూడు రోజుల కిందటే దేశంలో క‌రోనా బాధితుల‌ సంఖ్య లక్ష దాటగా.. గడిచిన 20 రోజుల్లోనే దాదాపు 70వేల కేసులు నమోదవ్వ‌డం గ‌మ‌నార్హం. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య‌ లక్ష దాటిన దేశాల జాబితాలో ఇండియా 11వ స్థానంలో నిలిచింది. ప్రజంట్ మన కంటే ఇరాన్ ముందు స్థానంలో ఉండగా.. దానిని నేడో రేపో అధిగమించే అవ‌కాశాలు కనబడతున్నాయి.ఇక మహారాష్ట్రలో క‌రోనావైర‌స్ ప్ర‌మాద ఘంటిక‌లు మోగిస్తోంది. దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల్లో 44% కేసులు ఆ ఒక్క రాష్ట్రం నుంచే ఉన్నాయి. అక్క‌డ‌ పాజిటివ్ కేసుల సంఖ్య 41,000 మార్క్ దాటింది.

మ‌రోవైపు దేశ‌వ్యాప్తంగా నాలుగ‌వ విడుత లాక్ డౌన్ కొన‌సాగుతోంది. మ‌రోవైపు భారీ స‌డ‌లింపులు ఇచ్చింది ప్ర‌భుత్వం. కరోనాకు ఇంత‌వ‌ర‌కు స‌మ‌ర్థ‌వంత‌మైన వ్యాక్సిన్ కానీ, మెడిసిన్ కానీ రాక‌పోవ‌డం వ‌ల్ల..ప్ర‌జ‌లు ఎవరికి వారే జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు సూచిస్తున్నాయి. మాస్క్ ధ‌రించ‌డం, భౌతిక దూరం పాటించ‌ని త‌ప్ప‌నిస‌రి అని చెబుతున్నాయి.

ఎరను మింగి మృత్యువు కోరల్లోకి వెళ్లిన కింగ్ కోబ్రా.. ఉమ్మడానికి..
ఎరను మింగి మృత్యువు కోరల్లోకి వెళ్లిన కింగ్ కోబ్రా.. ఉమ్మడానికి..
చిరును టార్గెట్ చేసిన రిషబ్ షెట్టి.. పోటీ మాములుగా లేదుగా..!
చిరును టార్గెట్ చేసిన రిషబ్ షెట్టి.. పోటీ మాములుగా లేదుగా..!
వీడో అసలైన జాతిరత్నం.. ఆన్సర్ పేపర్‌లో ఏం రాశాడో చూసి టీచర్ షాక్!
వీడో అసలైన జాతిరత్నం.. ఆన్సర్ పేపర్‌లో ఏం రాశాడో చూసి టీచర్ షాక్!
చిగుళ్ల వ్యాధి గుండెపోటుకు కారణం కావచ్చు.. వివరాలు తెలుసుకోండి
చిగుళ్ల వ్యాధి గుండెపోటుకు కారణం కావచ్చు.. వివరాలు తెలుసుకోండి
'కాస్త సిగ్గుండాలే'.. RCB ఆటగాళ్లు చేసిన పనికి అభిమానుల ఆగ్రహం
'కాస్త సిగ్గుండాలే'.. RCB ఆటగాళ్లు చేసిన పనికి అభిమానుల ఆగ్రహం
ఈ చిన్నది ఓ స్టార్ హీరోయిన్ చెల్లి.. ఆ పాన్ ఇండియా నటి ఎవరంటే.?
ఈ చిన్నది ఓ స్టార్ హీరోయిన్ చెల్లి.. ఆ పాన్ ఇండియా నటి ఎవరంటే.?
వామ్మో, ఇదేం డ్యాన్స్‌రా సామీ.. నాగిని పాటకు పైథాన్‌ స్టెప్పులు..
వామ్మో, ఇదేం డ్యాన్స్‌రా సామీ.. నాగిని పాటకు పైథాన్‌ స్టెప్పులు..
మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.?
మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.?
ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపంతో ఆత్మహత్య..
ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపంతో ఆత్మహత్య..
స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో
స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో