కరోనా ఇంపాక్ట్: ప్రపంచానికి 6 లక్షల కోట్ల డాలర్ల నష్టం

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని కుదిపేసింది. లాక్‌డౌన్‌ విధించి మంచే చేస్తున్నా కానీ ఆర్థికంగా అన్ని రకాల ప్రపంచ దేశాలూ నష్టాల్లోకి వెళ్లిపోయాయి. కరోనా వల్ల 2020లో ప్రపంచ వ్యాప్తంగా ఎకానమీ (జీడీపీ) 4 శాతం పడిపోతుందని పలువురి ఆర్థిక శాస్త్రవేత్తలు..

కరోనా ఇంపాక్ట్: ప్రపంచానికి 6 లక్షల కోట్ల డాలర్ల నష్టం
Follow us

| Edited By:

Updated on: Apr 28, 2020 | 8:03 AM

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని కుదిపేసింది. లాక్‌డౌన్‌ విధించి మంచే చేస్తున్నా కానీ ఆర్థికంగా అన్ని రకాల ప్రపంచ దేశాలూ నష్టాల్లోకి వెళ్లిపోయాయి. కరోనా వల్ల 2020లో ప్రపంచ వ్యాప్తంగా ఎకానమీ (జీడీపీ) 4 శాతం పడిపోతుందని పలువురి ఆర్థిక శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే మే నెలలో లాక్‌డౌన్ ఎత్తివేస్తే.. జులై తర్వాత ప్రపంచ దేశాలు తిరిగి పుంజుకునే అవకాశాలున్నాయంటున్నారు. ప్రస్తుతం అన్ని దేశాల ఎకానమీలూ పతనంపైవే నడుస్తున్నాయనీ, అంత్యంత సంపన్న దేశాల ఆర్థిక వ్యవస్థలు కూడా అద్వాన్న పరిస్థితుల్లోకి జారిపోయాయని లెక్కలేశారు. మొత్తంగా ఈ కరోనా కారణంగా ఇప్పటివరకూ 6 లక్షల కోట్ల నష్టం వచ్చినట్లు అంచనా వేశారు.

ఇక ప్రపంచ దేశాలపై ప్రభావం చూపే అమెరికాలో కూడా ఆర్థిక వ్యవస్థ జీడీపీ 6.4 శాతం కుదించుకుపోతుందని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. యూరో కరెన్సీ ఉన్న దేశాల్లో జీడీపీ 8.1, జపాన్‌లో 4 శాతం, ఇక చైనాలో ఇదివరకూ ఎన్నడూ లేని విధంగా తక్కువగా జీడీపీ నమోదవుతుందని తెలిపారు. ఈ భారీ నష్టాల నుంచి బయటపడాలంటే క్రమంగా లాక్‌డౌన్ నిబంధలను సడలించాలని ఆర్థిక శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. 1997లో వచ్చిన ఆసియా మాంద్యం, 2009లో వచ్చిన ప్రపంచ మాద్యం లాగా ఇప్పుడు కరోనా వల్ల ప్రపంచ దేశాల పునాదులు కదిలిపోయే పరిస్థితి ఉండబోతుందని ఆర్థిక వేత్తులు పేర్కొంటున్నారు.

Read More: 

మూడో విడత రేషన్ పంపిణీ.. ఈసారి బయోమెట్రిక్ తప్పనిసరి తాజా రూల్స్ ఇవే!

లైవ్‌లో ‘ఐలవ్‌యూ చెప్పి ముద్దు’ అడిగిన నెటిజన్.. ఇంటికొచ్చి మరీ తంతానంటోన్న హేమ

మళ్లీ లాక్‌డౌన్‌ పొడిగింపుకే మొగ్గుచూపుతోన్న సీఎం కేసీఆర్

విజయ్‌తో ఆ రొమాంటిక్ సీన్స్ నాకు అవసరమా అనిపించింది