పశ్చిమలో పల్లెలను వణికిస్తున్న ఢిల్లీ ప్రార్థనలు

ఢిల్లీ ప్రార్థ‌న‌ల ఎఫెక్ట్ అటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ క‌నిపిస్తోంది. రాష్ట్రంలో క‌రోనా కంట్రోల్‌లో ఉంది అనుకునే లోపుగానే ఢిల్లీ ప్రార్థ‌న అంశం ఇప్పుడు వ‌ణుకుపుట్టిస్తోంది. ఢిల్లీ ప్రార్థనలు పశ్చిమ గోదావరి జిల్లాలోని పల్లెలను, గల్లీలను సైతం వణికిస్తున్నాయి. ..

పశ్చిమలో పల్లెలను వణికిస్తున్న ఢిల్లీ ప్రార్థనలు
Follow us

|

Updated on: Mar 31, 2020 | 10:48 AM

ఢిల్లీ ప్రార్థ‌న‌ల ఎఫెక్ట్ అటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ క‌నిపిస్తోంది. రాష్ట్రంలో క‌రోనా కంట్రోల్‌లో ఉంది అనుకునే లోపుగానే ఢిల్లీ ప్రార్థ‌న అంశం ఇప్పుడు వ‌ణుకుపుట్టిస్తోంది. ఢిల్లీ ప్రార్థనలు పశ్చిమ గోదావరి జిల్లాలోని పల్లెలను, గల్లీలను సైతం వణికిస్తున్నాయి. జిల్లా నుంచి కూడా నిజాముద్దీన్ ప్రార్థనలకు కొందరు వెళ్లారు. ఇప్పుడు దానిచుట్టునే కరోనా వ్యాప్తి ఆందోళన కలిగిస్తుంది. ఏపి లో ఎక్కడా లేని విధంగా గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ఉన్నా, ఇలాంటి సమాచారం సేకరించ లేదు. నిజాముద్దీన్ ప్రార్ధనల నుంచి స్వస్థలాలకు వచ్చిన వారు స్థానికంగా కూడా ప్రార్ధనలు నిర్వహించారని చెబుతున్నారు. ప్రతి ఏటా ఢిల్లీ లో వార్షిక ప్రార్థనలు నిర్వహిస్తారు. అక్కడికి తెలుగు రాష్ట్రాల నుంచి వందల సంఖ్యలో వెళ్తారు. ఇప్పటి వరకూ ఒక్క కరోనా కేసు నమోదు కాని జిల్లాలో సైతం తాజా పరిణామం బయటపడిన నేపథ్యంలో  భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

మ‌రోవైపు ఢిల్లీ ప్రార్థనల అంశం ఇటు తెలంగాణ‌లోనూ క‌ల్లోలం రేపుతోంది. ఢిల్లీలో మార్చి 13-15 తేదీల్లో నిజాముద్దీన్‌లో జరిగిన ప్రార్థనలకు ఒక్క తెలంగాణ నుంచే 280 మంది పాల్గొన్నట్లు తెలిసింది. వారిలో ఆరుగురు కరోనా పాజిటివ్ లక్షణాలతో చనిపోవడం ఇప్పుడు అంద‌రిని షాక్‌కు గురిచేస్తోంది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో  ఏయే జిల్లాల నుంచి ఎంత మంది ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లారో డేటా సేకరించి, వారి ఆరోగ్య ప‌రిస్థితుల‌పై ఆరా చేప‌ట్టింది. త‌క్ష‌ణమే వారంద‌రినీ గుర్తించి క్వారంటైన్‌కు త‌ర‌లించే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?