Breaking News
  • దేశంలో కరోనా వైర‌స్ వీర‌విహారం చేస్తోంది. రోజురోజుకూ కేసులు సంఖ్య‌తో పాటు, మరణాల సంఖ్య కూడా ప్ర‌మాద‌క‌ర రీతిలో పెరుగుతోంది. కొత్తగా 22 వేల 771 మంది వైరస్​ సోకింది. మరో 442 మంది క‌రోనా కార‌ణంగా ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా వివ‌రాలు వెల్లడించింది. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,48,315. ప్ర‌స్తుతం యాక్టీవ్ కేసులు 2,35,433. వ్యాధి బారి నుంచి కోలుకున్న‌వారు 3,94,227. క‌రోనాతో మొత్తం ప్రాణాలు విడిచినవారి సంఖ్య 18,655.
  • తిరుమల: నేడు ఉదయం 11గంటలకు టిటిడి బోర్డ్ అత్యవసర సమావేశం. తిరుమల కొండపై పదిమంది టిటిడి ఉద్యోగులకు కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో ఏమి చేయలనేదానిపై అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన టిటిడి. కరోనా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించనున్న టిటిడి.
  • దేశంలో పెరుగుతున్న కోవిడ్-19 రికవరీ రేటు. 60.8శాతానికి చేరుకున్న కోలుకున్నవారి సంఖ్య. కోలుకున్నవారు 95.48శాతం, మృతుల శాతం 4.52.
  • కృష్ణా జిల్లా : కొల్లు రవీంద్రను వీడియో కాన్పిరెన్స్ ద్వారా మెజిస్ట్రేట్ ముందు‌ హాజరుపరిచిన పోలీసులు. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో ఇంటి నుంచే న్యాయమూర్తి కేసు విచారణ. కొనసాగుతున్న విచారణ. వీడియో కాన్పిరెన్స్ లో విచారణ అనంతరం న్యాయమూర్తి కొల్లు రవీంద్రకు రిమాండ్ విధించే అవకాశం.
  • నిర్మాత పోకూరి రామారావు ఈరోజు ఉదయం కరోన కారణంగా మృతి చెందారు. పోకూరి రామారావు పోకూరి బాబురావు సోదరుడు. ఈతరం ఫిలిమ్స్ లో ఎన్నో చిత్రాలు తీశారు.
  • ఇంజనీరింగ్ విద్యార్థిని అశ్లీల చిత్రాలు ఇన్ స్టాగ్రాంలో పోస్ట్ చేసిన విద్యార్థిని గుర్తించిన పోలీసులు. యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఆ యువకుడికి వీడియోలు ఎలా వచ్చాయన్న కోణంలో విచారణ. ఆ యువకుడు మరికొంతమందికి వీడియోస్ షేర్ చేసినట్లు గుర్తించిన పోలీసులు. కేసులో కొనసాగుతున్న విచారణ
  • తెలంగాణ లో రికార్డు స్థాయిలో కేసులు. రాష్ట్రంలో 20 వేలు, హైదరాబాద్ లో 16 వేలు దాటిన పాజిటివ్ కేసులు. లక్ష దాటిన కరోనా టెస్టింగ్ లు. రాష్ట్రంలో నిన్న ఒక్క రోజే 1892 కరోనా పాజిటివ్ కేసులు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కేసులు- 20,462. జిహెచ్ఎంసి పరిధిలో ఒక్క రోజు 1658 కేసులు. Ghmc లో 16, 219కు చేరుకున్న కేసులు. 283 కి చేరుకున్న కరోనా మరణాలు. చికిత్స పొందుతున్న వారు- 9984. డిశ్చార్జి అయిన వారు -10195.
  • జీవీకే కుంభకోణంపై ఈడీ ఆరా. సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను తమకివ్వాలని ఈడీ లేఖ. జీవీకే స్కాంపై ప్రాథమిక సాక్ష్యాలు సేకరిస్తున్న ఈడీ.

జపాన్ నౌకలో ‘కరోనా’.. 3,700 మందికి 14 రోజుల ‘నిర్బంధం’

The 2666 passengers on board the liner are confined to their rooms as medical personnel conduct checks, జపాన్ నౌకలో ‘కరోనా’.. 3,700 మందికి 14 రోజుల ‘నిర్బంధం’

జపాన్ లోని యోకొహోమా పోర్టుకు చేరింది ఓ నౌక.. ‘డైమండ్ ప్రిన్సెస్’ అనే ఈ నౌకలో కరోనా సోకిన 10 మంది వ్యక్తులు ఉన్నట్టు తెలియడంతో అంతా అలర్ట్ అయ్యారు. ఇందులోని 3,700 మందికి స్కానింగ్ టెస్టులు అవసరమయ్యాయి. వీరంతా 14 రోజుల పాటు తప్పనిసరిగా ఈ నౌకలో ఉండాల్సిందేనని అధికారులు స్పష్టం చేశారు.

The 2666 passengers on board the liner are confined to their rooms as medical personnel conduct checks, జపాన్ నౌకలో ‘కరోనా’.. 3,700 మందికి 14 రోజుల ‘నిర్బంధం’వ్యాధి లక్షణాలున్న పది మందిని వెంటనే ఆసుపత్రులకు తరలించారు. తమను నౌకలోని తమ క్యాబిన్ల నుంచి బయటకి రాకూడదని ఆంక్షలు విధించారని ఇతర ప్రయాణికులు వాపోతున్నారు. పైగా తమకు ఇచ్ఛే ఆహారాన్ని తగ్గించారని, లిక్కర్ కూడా ఆపివేశారని వారు తెలిపారు. సాధారణంగా టూరిస్టులతో రద్దీగా కనబడే ఈ ‘ ప్రిన్సెస్’ నౌక ఇప్పుడు వెలవెలబోతోంది. టెస్టుల్లో… తమకు కరొనా లేదని ఎప్పడు తేలుతుందా అని వందలమంది ఎదురుచూస్తున్నారు. హాంకాంగ్ లో 80 ఏళ్ళ వ్యక్తి ఒకరు గతనెల ఈ నౌక దిగివెళ్ళాడు.The 2666 passengers on board the liner are confined to their rooms as medical personnel conduct checks, జపాన్ నౌకలో ‘కరోనా’.. 3,700 మందికి 14 రోజుల ‘నిర్బంధం’

అతనికి కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టు తేలడంతో ఈ నౌకలోనివారిమీద కూడా అనుమానాలు తలెత్తాయి. ఈ షిప్ లో 3,711 మంది ప్రయాణికులను, సిబ్బందిని స్కాన్ చేశారని, వీరిలో 273 మందికి మరిన్ని టెస్టులు చేయాల్సి ఉందని జపాన్ ఆరోగ్య శాఖ మంత్రి కసుకొబు కిటో తెలిపారు. 56 దేశాలకు చెందినవారు ఈ నౌకలో ప్రయాణిస్తున్నట్టు ఆయన చెప్పారు. టెస్టుల విషయంలో వీరంతా అధికారులకు సహకరించాలని ఆయన కోరారు.

 

 

 

 

Related Tags