Tiger infected అమెరికాలో పులికి కరోనా… మోదీ ఏం చేశారంటే?

కరోనా మహమ్మారి మనుషులతో సహా జంతువులను కబళించే పరిస్థితి కనిపిస్తోంది. అమెరికాలోని జూలో ఓ పులికి కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలడంతో యావత్ ప్రపంచం నివ్వెర పోయింది. ఇంతకాలం కరోనా వైరస్ మనుషులకే సోకుంతుందని అనుకుంటున్న తరుణంలో...

Tiger infected అమెరికాలో పులికి కరోనా... మోదీ ఏం చేశారంటే?
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 06, 2020 | 1:08 PM

American tiger infected by Covid-19 కరోనా మహమ్మారి మనుషులతో సహా జంతువులను కబళించే పరిస్థితి కనిపిస్తోంది. అమెరికాలోని జూలో ఓ పులికి కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలడంతో యావత్ ప్రపంచం నివ్వెర పోయింది. ఇంతకాలం కరోనా వైరస్ మనుషులకే సోకుంతుందని అనుకుంటున్న తరుణంలో జంతువులకు కూడా కరోనా సోకే ప్రమాదం వుందని తేలడంతో అందరు ఆశ్చర్యంతోపాటు భయాందోళనకు గురవుతున్నారు.

అమెరికాలో పులికి కరోనా పాజిటివ్ నమోదవడంతో చాలా దేశాలతోపాటే భారత్ కూడా ఉలిక్కి పడింది. ఈ విషయంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దృష్టి సారించారు. దేశంలోని అన్ని జూలకు నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేయాలంటూ అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖను ఆదేశించారు. దాంతో జంతు ప్రదర్శన శాలల్లో వున్న అన్ని జంతువులకు మరీ ముఖ్యంగా పిల్లులు, ముంగీసలు, వానరాలకు ప్రత్యేకంగా రక్షణ చర్యలు తీసుకోవాలని పర్యావరణ శాఖ దేశంలోని అన్ని జంతు ప్రదర్శనశాలల అధికార యంత్రాంగానికి ఉత్తర్వులు జారీ చేసింది.

మనుషుల లక్షణాల్లో కొన్నింటిని కలిగి వుండే క్షీరదాలకు కరోనా వైరస్ సోకే ప్రమాదం వుందని పశు వైద్యులు అంఛనా వేస్తున్నారు. అందుకే పాలిచ్చే జంతువులకు రక్షణ పెంచాలన్నది కేంద్రం ఆదేశాల సారాంశం. కేంద్రం అప్రమత్తం చేయడంతో హైదరాబాద్, తిరుపతి జంతు ప్రదర్శన శాలల అధికారులు అలర్ట్ అయ్యారు. వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలకు ఉప్రక్రమించారు. అయితే.. జూలలో ఇప్పటికే సందర్శకుల ప్రవేశంపై నిషేధం వున్న నేపథ్యంలో మనదేశంలో పెద్దగా సమస్యలేదన్న అభిప్రాయం వినిపిస్తోంది.

ఏప్రిల్ 15వ తేదీ నుంచి లాక్ డౌన్ తొలగిపోనున్న తరుణంలో జూలకు సందర్శకుల తాకిడి మళ్ళీ ప్రారంభం కానున్నది. దానికి తోడు వేసవి సెలవులు కూడా కావడంతో వారి సంఖ్య ఎక్కువగా వుండే ఛాన్స్ వుంది. ఈ క్రమంలో ఏప్రిల్ 15వ తేదీ కల్లా జూలలో ప్రత్యేక ఏర్పాట్లు జరుపుతామని జూ అధికారులు అంటున్నారు.

యూత్‌ని చెవిటివారిగా చేసిన డీజే సౌండ్.. పలువురిపై కేసు నమోదు
యూత్‌ని చెవిటివారిగా చేసిన డీజే సౌండ్.. పలువురిపై కేసు నమోదు
మిర్చిబండి వద్ద స్నాక్స్‌ తిని యూపీఐ చెల్లింపు చేసిన కేంద్రమంత్రి
మిర్చిబండి వద్ద స్నాక్స్‌ తిని యూపీఐ చెల్లింపు చేసిన కేంద్రమంత్రి
కాలేజ్ ఫెస్ట్‏లో సాయి పల్లవి మాస్ డాన్స్.
కాలేజ్ ఫెస్ట్‏లో సాయి పల్లవి మాస్ డాన్స్.
నయా ట్రెండ్ సినిమాటిక్ యూనివర్స్.. ఆ బాటలో ఎవరున్నారంటే.?
నయా ట్రెండ్ సినిమాటిక్ యూనివర్స్.. ఆ బాటలో ఎవరున్నారంటే.?
ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో 264 నెంబర్‌ని కనిపెట్టండి చూద్దాం..
ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో 264 నెంబర్‌ని కనిపెట్టండి చూద్దాం..
వ్యాపారం మీ లక్ష్యం అయితే.. పెట్టుబడి ప్రభుత్వమే ఇస్తుంది.. అదెలా
వ్యాపారం మీ లక్ష్యం అయితే.. పెట్టుబడి ప్రభుత్వమే ఇస్తుంది.. అదెలా
కేసీఆర్ ఇంటి పక్కనే క్షుద్రపూజలు.. రాత్రివేళ ఏం జరిగింది..?
కేసీఆర్ ఇంటి పక్కనే క్షుద్రపూజలు.. రాత్రివేళ ఏం జరిగింది..?
గుండెపోటుకు చెక్‌ పెట్టి రక్త ప్రసరణను మెరుగుపరిచే ఆహారాలు
గుండెపోటుకు చెక్‌ పెట్టి రక్త ప్రసరణను మెరుగుపరిచే ఆహారాలు
అనుకూలంగా శుక్ర గ్రహం.. ఈ రాశులకు చెందిన మహిళలకు మహా యోగాలు!
అనుకూలంగా శుక్ర గ్రహం.. ఈ రాశులకు చెందిన మహిళలకు మహా యోగాలు!
తెలంగాణలో రుణమాఫీ మంటలు.. రేవంత్ ప్రకటనపై బీజేపీ, బీఆర్ఎస్ ఫైర్..
తెలంగాణలో రుణమాఫీ మంటలు.. రేవంత్ ప్రకటనపై బీజేపీ, బీఆర్ఎస్ ఫైర్..