ఆ సమయానికే ‘మహా కుంభమేళా’ జరుగుతుందా..!

హరిద్వార్‌లో జరిగే 'మహా కుంభమేళా' గురించి.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సారి 'మహా కుంభమేళా' మార్చి 2021లో జరగనుంది. అయితే కోవిడ్ వ్యాప్తి కారణంగా కుంభమేళాను ఒక సంవత్సరం వాయిదా వేసి..

ఆ సమయానికే 'మహా కుంభమేళా' జరుగుతుందా..!
Follow us

| Edited By:

Updated on: May 31, 2020 | 8:34 PM

హరిద్వార్‌లో జరిగే ‘మహా కుంభమేళా’ గురించి.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సారి ‘మహా కుంభమేళా’ మార్చి 2021లో జరగనుంది. అయితే కోవిడ్ వ్యాప్తి కారణంగా కుంభమేళాను ఒక సంవత్సరం వాయిదా వేసి.. 2022లో నిర్వహించాలని హరిద్వార్‌కు చెందిన కొంతమంది సాధువులు కోరుతున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా కుంభమేళాకు సంబంధించిన పనులను ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిలిపివేసింది. అటు అఖిల భారత అఖాడా కౌన్సిల్ కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఉత్సవాన్ని నిర్వహించలేమని స్పష్టం చేసింది.

మహా కుంభమేళాకు ఇంకా ఏడు నెలల సమయం ఉంది. ఈ కుంభమేళాకు వివిధ రాష్ట్రాల నుంచి 5 కోట్లకు పైగా జనం హాజరవుతారని గతంలో అధికారులు అంచనా వేశారు. ఈ మేళా నిర్వహణ పనులకు యూపీ ప్రభుత్వం ఇప్పటివరకు సుమారు రూ.4 వందల కోట్లు ఖర్చు చేసింది. కాగా ఈ సందర్భంగా అఖాడా కౌన్సిల్ అధ్యక్షుడు మహాంత్ నరేంద్ర గిరి మాట్లాడుతూ.. ఇది శాశ్వత సంప్రదాయానికి సంబందించిన విషయం. అయినా కుంభమేళా నిర్వహణకు చాలా సమయం ఉంది. అప్పటికి పరిస్థితులు మెరుగుపడతాయి. కుంభమేళా నిర్ణీత సమయానికే జరుగుతుందన్నారు. కాగా కరోనా ప్రభావం కుంభమేళాపై పడనుంది. కుంభమేళాకు సంబంధించి కేంద్రం సూచించిన గైడ్‌లైన్స్‌ను అనుసరిస్తామని ఉత్తరాఖండ్ పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ఇది కూడా చదవండి:

రైతులకు కేంద్రం అందించే బంపర్ ఆఫర్.. చివరి తేదీ ఇదే!

బిగ్ బ్రేకింగ్: జూన్‌ 30 వరకూ లాక్‌డౌన్ పొడిగించిన తెలంగాణ సర్కార్