మాస్క్ ధ‌రించ‌ని వారిపై అధికారుల కొర‌ఢా.. ఒకే రోజు 12 వేల మందికి జ‌రిమానా.. రూ. 24 ల‌క్ష‌లు వ‌సూలు

కరోనా మహమ్మారి తెస్తున్న తంటాలు అన్నీ ఇన్నీ కావు. కరోనా నుంచి ర‌క్షించుకునేందుకు ప్ర‌తి ఒక్క‌రు మాస్కులు ధ‌రించాల‌ని ప‌దేప‌దే చెబుతున్నా.. కొంద‌రు పెడ‌చెవిన పెడుతున్నారు....

మాస్క్ ధ‌రించ‌ని వారిపై అధికారుల కొర‌ఢా.. ఒకే రోజు 12 వేల మందికి జ‌రిమానా.. రూ. 24 ల‌క్ష‌లు వ‌సూలు
People
Follow us

|

Updated on: Dec 17, 2020 | 10:22 AM

కరోనా మహమ్మారి తెస్తున్న తంటాలు అన్నీ ఇన్నీ కావు. కరోనా నుంచి ర‌క్షించుకునేందుకు ప్ర‌తి ఒక్క‌రు మాస్కులు ధ‌రించాల‌ని ప‌దేప‌దే చెబుతున్నా.. కొంద‌రు పెడ‌చెవిన పెడుతున్నారు. అలాంటి వారిపై అధికారులు కొర‌ఢా ఝులిపిస్తున్నారు. తాజాగా ముంబాయి మున్సిప‌ల్ అధికారులు ఒకే రోజు మాస్కులు ధ‌రించ‌ని 12 వేల‌కుపైగా మందిని ప‌ట్టుకుని రూ.24 ల‌క్ష‌లు జరిమానా వ‌సూలు చేశారు. బీఎంసీ సిబ్బంది ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు 68 ల‌క్ష‌ల మంది నుంచి రూ.14 కోట్ల‌కుపైగా జ‌రిమానా వ‌సూలు చేశారు. దీంతో బీఎంసీ ఖాజ‌నాలో భారీగా ఆదాయం వ‌చ్చి చేరింది. అయితే క‌రోనా మ‌హ‌మ్మారి తీవ్ర త‌గ్గుతుండ‌టంతో కొంత ఊర‌ట‌నిచ్చే విష‌య‌మే. ముంబాయిలో క‌రోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అలాగే మాస్కులు ధ‌రించ‌కుండా రోడ్ల‌పై తిరుగుతున్న‌వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. క‌రోనా నుంచి కాపాడుకునేందుకు ప్ర‌తి ఒక్క‌రు మాస్కులు ధ‌రిస్తూ భౌతిక దూరం పాటించాల‌ని ప‌దేప‌దే చెబుతున్నా.. జ‌నాలు పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు. క‌రోనా నిబందధ‌న‌ల‌ను తుంగ‌లో తొక్కేయ‌డంతో రంగంలోకి దిగిన అధికారులు త‌గిన గుణ‌పాఠం చెబుతున్నారు. కేసుల సంఖ్య పెరిగిపోతుండ‌టంతో ముంబాయి ఆరోగ్య‌శాఖ అధికారులు ఆందోళ‌న చెందుతున్నారు.

మాస్కులు త‌ప్ప‌నిస‌రి కాగా, క‌రోనాను క‌ట్ట‌డి చేయాలంటే ప్ర‌తి ఒక్క‌రు మాస్కులు ధ‌రించ‌డం త‌ప్ప‌ని స‌రి చేసింది. కొంద‌రు క‌ర‌నా నిబంధ‌న‌లు పాటించ‌కుండా బ‌య‌ట‌కు వ‌చ్చి ప‌ట్టుబ‌డితో భారీగా జ‌రిమానా చెల్లించాల్సి ఉంటుంద‌ని అధికారులు చెబుతున్నా.. కొంద‌రు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌తి రోజు 20 నుంచి 25 మంది పైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఇటీవ‌ల బీఎంసీ క‌మిష‌న‌ర్ ఇక్బాల్ సింగ్ చ‌హ‌ల్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆరోగ్య సిబ్బందితో పాటు క్లీన్ అఫ్ మార్ష‌ల్స్ , అధికారులు, ఫ్ల‌యింగ్ స్క్వాడ్ దాడులు చేస్తున్నారు.

కాగా, ప్ర‌తి రోజు దాదాపు ఐదు వేల మందిని ప‌ట్టుకుని జ‌రిమానా విధిస్తున్నారు. ఒకే రోజు ఇంత భారీ సంఖ్య‌లో జ‌రిమానాలు విధించ‌డం మొద‌టిసారి. ఏప్రిల్ నుంచి ఇప్ప‌టి వ‌ర‌క‌కు 68,38,060 మందిపై చ‌ర్య‌లు తీసుకున్నారు. వీరి నుంచి రూ.14,04,06,200 జ‌రిమానాలు వ‌సూలు చేసిన‌ట్లు బీఎంసీ అధికారులు పేర్కొన్నారు.

డిసెంబ‌ర్ చివ‌రి నాటికి 11.6 ల‌క్ష‌ల క‌రోనా వ్యాక్సిన్ డోసులు.. రానున్న రెండు నెల‌ల్లో 23 ల‌క్ష‌ల డోసులు

మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
మళ్లీ కెలుక్కుంటాను అంటే రా.! డైరెక్టర్ హరీష్ శంకర్ బిగ్ పంచ్.
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
చూస్తుంటే గుండె బరువుగా, నిండుగా ఉంది.. నాని ఎమోషనల్ పోస్ట్.!
యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం
యాక్షన్ కింగ్ కూతురు మామూలుగా లేదుగా.. హీరోయిన్స్ ను మించే అందం