Breaking News
  • చైనాతో రగడపై రాజ్​నాథ్​ ప్రకటన: లద్దాఖ్‌లో 1962లో చైనా వేల కిలోమీటర్ల భూభాగం ఆక్రమించింది. చైనాతో సరిహద్దు సమస్య పరిష్కారం కాలేదు. మొత్తం 90 వేల చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించింది. ప్రధాని మోదీ లద్దాఖ్‌ వెళ్లి సైనికులను కలిశారు. సరిహద్దుల నిర్ణయానికి చైనా ఒప్పుకోవడం లేదు. ఎల్‌ఏసీ విషయంలో రెండుదేశాల మధ్య వివాదాలు ఉన్నాయి. ద్వైపాక్షిక సంబంధాలు పెంచుకునేందుకు ఎంతో ప్రయత్నించాం. చైనాతో మేం స్నేహపూర్వక సంబంధాలనే కోరుకుంటున్నాం.
  • తిరుమల: టీవీ9తో శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడి వేణుగోపాల దీక్షితులు. తిరుమల శ్రీవారి ఆలయ చరిత్రలో బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించడం ఇదే తొలిసారి. ప్రస్తుత సంక్షోభ పరిస్థితిలో శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఆపకుండా నిర్వహించేందుకు ఆలయంలో ఏకాంతంగా నిర్వహించాలని నిర్ణయించాం. రథోత్సవ స్థానంలో సర్వభూపాల వాహనాన్ని నిర్వహించడానికి ఆగమశాస్త్రం ప్రకారం ఎటువంటి అభ్యంతరంలేదు. సర్వభూపాల వాహనం స్వామివారి రథాన్ని పోలి ఉండటంతో రథోత్సవస్థానంలో నిర్వహించాలని నిర్ణయించాం. బ్రహ్మోత్సవసేవల్లో ఎక్కువమంది అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొనే ఆవశ్యకత ఉండటంతో ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో వాహనసేవలు నిర్వహించాలని నిర్ణయించాం. మాడవీధుల్లో నిర్వహించే దివ్య ప్రబంధం, మంగళవాయిద్యాలు, వేద పారాయణాన్ని ఆలయంలోనే ఏకాతంగా నిర్వహిస్తాం. ఉదయం 9 నుండి 10 గంటల వరకు, సాయంత్రం 7 నుండి 8 గంటల వరకు వాహనసేవలు నిర్వహిస్తాం. ఉత్సవమూర్తి అలంకరణ, వైదిక కార్యక్రమాలను యథావిధిగా నిర్వహిస్తాం. గరుడవాహనంరోజు సీఎం జగన్ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. చక్రస్నానాన్ని పుష్కరిణీలో చేసే పరిస్థితి లేకపోవడంతో ఆలయంలోనే గంగాళంలో చక్రస్నానాన్ని నిర్వహిస్తాం. టీవీ9తో శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడు వేణుగోపాల దీక్షితులు.
  • కృష్ణవరం టోల్‌గేట్ వద్ద లారీ బీభత్సం . తూర్పుగోదావరి జిల్లా : కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్‌గేట్ వద్ద లారీ బీభత్సం సృష్టించింది. కామారెడ్డి నుంచి నిజామాబాద్ వైపు వేగంగా వస్తున్న లారీ ఒక్కసారిగా బ్రేకులు ఫెయిల్ కావడంతో మూడు కార్లను ఢీకొట్టి, టోల్ గేట్ డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి, గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు.
  • అమరావతి: మాజీ అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌పై ఏసీబీ కేసు నమోదు. రాజధాని భూముల ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌లో భాగస్వామి అయ్యారన్న ఏసీబీ. భూముల కొనుగోళ్లలో ఏజీగా అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు అబియోగం. పదవిని అడ్డుపెట్టుకుని బంధువులతో 2014లో భూమి కొనుగోలు చేయించిన శ్రీనివాస్. 2015, 2016లో ఆ భూములు కొన్నట్లు ఏసీబీ అభియోగాలు. తన పేరిట, భార్య పేరిట దమ్మాలపాటి శ్రీనివాస్ భూముల కొనుగోళ్లు. ఇప్పటికే తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు కోరుతూ హైకోర్టులో పిటిషన్‌.
  • శాస‌న మండ‌లి... టీఎస్ బిపాస్ చర్చలో మంత్రి కేటీఆర్ : టీఎస్ బిపాస్ ప్రజలకు బ్రహ్మాస్త్రం. 75 గజాలు లోపు అని.. అనుమతులు అవసరం లేదు కదా అని కుతుబ్ మినార్ కడితే ప్రభుత్వం చూస్తూ ఉరుకోదు . అక్టోబర్ మొదటి వారంలో హైకోర్టు లో బీఆర్ఎస్ పై విచారణ ఉంది . బిల్డింగ్ ,లే అవుట్ పర్మిషన్ ల కోసం టిఎస్ బిపాస్ సూపరియర్ చట్టం . ఎన్వోసి బాధ్యత కూడా మున్సిపల్ శాఖదే టీఎస్ బిపాస్ అర్బన్ గవర్నెన్స్ లో విప్లవాత్మకమైన అడుగు . భవన నిర్మాణ అనుమతికి టౌన్ ప్లానింగ్ అధికారుల దయ ...మన ప్రాప్తంకు టీఎస్ బిపాస్ తో చరమ గీతం . బిల్డింగ్ నిర్మాణంకు 21 రోజుల్లో అనుమతి ఇవ్వకపోతే...22 వ రోజు అనుమతి వచ్చినట్టే సెల్ఫ్ సర్టిఫికేషన్ లో అప్లై చేసుకున్న స్థలంలో కాకుండా నిర్మాణాలు చేపడితే....నోటీసులు లేకుండా కూల్చివేస్తారు. టీఎస్ బిపాస్ బిల్లు 2020కి శాసన మండలి ఆమోదం.
  • టివి9 ఎఫెక్ట్: మదీనాగూడ లో మంజీర పైపులైన్ లికేజీ పనులు ప్రారంభించిన వాటర్ బోర్డు. అర్ధరాత్రి వాటర్ ఫోర్స్ తో బ్రేక్ అయిన పైప్ లైన్. స్థానిక అపార్టుమెంట్స్,కాలనీల్లో ప్రవేశించిన వాటర్. నీటమునిగిన పరిసర అపార్టుమెంట్స్. వాటర్ ఫ్లో రావడంతో భయబ్రాంతులకు గురై అపార్ట్మెంట్ వాసులు. పూర్తిగా నీటిలో మునిగి డేమెజ్ అయిన సెల్లార్స్ లోని వాహనాలు . బయటికి రావడానికి వీలు కాకపోవడంతో రాత్రి నుండి ఇళ్లలోనే ఉండి అపార్టెమెంట్ వాసులు. పైప్ లైన్ లీకేజీని బహిర్గతం చేసిన టివి9 . టివి9 వార్తా కథనాలతో స్పందించిన అధికారులు.

పండ్లు, కూరగాయలు, ప్యాకేజ్డ్‌ ఫుడ్‌తో ఢోకా లేదు

కరోనా మహమ్మారి చాపకింద నీరులా వ్యాపిస్తుండటంతో ఎక్కడ వైరస్ భారీనపడతామోనన్న ఆందోళన సగటు మనిషిని పట్టిపీడిస్తోంది. దీంతో బయటకు వెళ్లి ఏం కొనాలన్నా, ఏం తినాలన్నా వైరస్ భయమే వెంటాడుతోంది. అయితే ఆహార పదార్థాల ద్వారా కరోనా వైరస్ మానవ శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉందనడానికి ఎలాంటి ఆధారాల్లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది.
Corona does not come with fruits vegetables packaged food, పండ్లు, కూరగాయలు, ప్యాకేజ్డ్‌ ఫుడ్‌తో ఢోకా లేదు

కరోనా మహమ్మారి చాపకింద నీరులా వ్యాపిస్తుండటంతో ఎక్కడ వైరస్ భారీనపడతామోనన్న ఆందోళన సగటు మనిషిని పట్టిపీడిస్తోంది. దీంతో బయటకు వెళ్లి ఏం కొనాలన్నా, ఏం తినాలన్నా వైరస్ భయమే వెంటాడుతోంది. చాలా మంది కనీసం బయటకు వెళ్లి కూరగాయలు, పండ్లు కొనడానికి కూడా జంకుతున్నారు. బయట నుంచి ఆహార పదార్థాలు తెచ్చుకోవడం దాదాపుగా మానేశారు. అయితే ఆహార పదార్థాల ద్వారా కరోనా వైరస్ మానవ శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉందనడానికి ఎలాంటి ఆధారాల్లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది.

కరోనా మహమ్మారి కారణంగా నిత్యవసర మార్కెట్లు, హోటళ్లు వినియోగదారులు లేక వెలవెలాపోతున్నాయి. కరోనా వైరస్ వ్యాపిస్తుందనే భయమే దీనికి కారణం. కూరగాయాలు, ఇతర ఆహార పదార్థాలు బయట నుంచి తెచ్చుకోవడం ద్వారా వైరస్ వ్యాపిస్తోందన్న ప్రచారం జరిగింది. దీంతో నిత్యం రద్దీగా వుండే కూరగాయల మార్కెట్లకు జనం వెళ్లడమే మానేశారు. ఇక బయట నుంచి ఆహార పదార్దాలు తెచ్చుకోవడం పూర్తిగా మానేశారు. ఇలా వైరస్ వ్యాప్తిపై ప్రజల్లో అనేక సందేహాలు, అపోహలు ఉన్నాయి. ఈ నేథఫ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని ముఖ్యమైన సూచనలు చేసింది. ఏ ఆహార పదార్థమైనా పరిమిత స్థాయిలో తీసుకోవాలని, వినియోగానికి ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఫలానా పదార్థాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కరోనా రాదనే ప్రచారంలో వాస్తవం లేదని తెలిపింది.

Corona does not come with fruits vegetables packaged food, పండ్లు, కూరగాయలు, ప్యాకేజ్డ్‌ ఫుడ్‌తో ఢోకా లేదు

ఆహార పదార్థాలు, పండ్లు, కూరగాయల ద్వారా కోవిడ్‌–19 వ్యాప్తి చెందుతుందన్న దానికి ఆధారాల్లేవు. తగిన జాగ్రత్తలతో తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాలని సూచించింది. పండ్లు, కూరగాయలను వాడే ముందు చేతుల్నిసబ్బుతో కడుకొని, వాటిని స్వచ్ఛమైన నీటితో కడగాలని సూచించింది.

జీవం ఉన్న జంతువులు, మనుషుల్లోనే వైరస్‌ బతికి ఉండడంతో పాటు, వైరస్‌ వ్యాప్తికి అవకాశం ఉంది. ప్యాకేజీ ఉపరితలాల ద్వారా వైరస్‌ వ్యాపించదని తెలిపింది. కాబట్టి ప్యాకేజీ ఫుడ్‌ హానికరం కాదని. ఈ ఫుడ్‌ ప్యాకెట్లను శానిటైజ్‌ చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. కానీ వాటిని ముట్టుకునే ముందు, తినేటప్పుడు శుభ్రంగా చేతులు సూచించింది.

Corona does not come with fruits vegetables packaged food, పండ్లు, కూరగాయలు, ప్యాకేజ్డ్‌ ఫుడ్‌తో ఢోకా లేదు

ఆహార పదార్థాల్లో ఉండే ఇతర వైరస్‌లు, బ్యాక్టీరియాల మాదిరిగానే నిర్ణీత ఉష్ణోగ్రత వరకు ఉడికిస్తే కరోనా వైరస్‌ కూడా చనిపోతుందని తెలిపింది. మాంసం, గుడ్లను కనీసం 70 డిగ్రీల సెంటిగ్రేడ్‌ వరకు ఉడికించాలని సూచించింది. అయితే, మాంసం పచ్చిగా ఉన్నప్పుడు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.

గృహావసరాల కోసం మార్కెట్లు, మాల్స్‌కు వెళ్లినంత మాత్రాన కరోనా సోకదని తెలిపింది. కానీ మాల్స్, మార్కెట్లలోకి ప్రవేశించే ముందు చేతులు శానిటైజ్‌ చేసుకోవాలని సూచించింది. దగ్గు లేదా తుమ్ము వస్తే మోచేతిని అడ్డుపెట్టుకోవాలని. కనీసం మీటర్‌ భౌతికదూరం పాటించాలని తెలపింది. మాస్క్‌ రక్షణ తప్పనిసరిగా వినియోగించాలని కోరింది.

Corona does not come with fruits vegetables packaged food, పండ్లు, కూరగాయలు, ప్యాకేజ్డ్‌ ఫుడ్‌తో ఢోకా లేదు

నిత్యావసరాల హోం డెలివరీ కారణంగా వైరస్‌ వ్యాపించదని తెలిపింది. కానీ ఆ సరుకులు తెచ్చే వ్యక్తులు జాగ్రత్తలు పాటించాలని కోరింది. సరుకులు తీసుకున్న తర్వాత చేతులు చాలా జాగ్రత్తగా, శుభ్రంగా కడుక్కోవాలని సూచించింది. వైరస్‌ బారినపడకుండా బలమైన ఆహారం తీసుకోవాలని కోరింది. ధాన్యాలు, పండ్లు, మాంసం, కూరగాయలు, గింజలు, పీచు పదార్థాలు ఎక్కువ తినాలని సూచించింది. పసుపు, అల్లం ఎక్కువగా తీసుకుంటే కరోనా రాదనే ప్రచారంలో వాస్తవం లేదని తెలిపింది.

Related Tags