Breaking News
  • సౌత్ ,వెస్ట్ తెలంగాణ జిల్లాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు. తెలంగాణ పరిసర ప్రాంతాల్లో 2.5 కి.మీ ఎత్తు వరకు కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం. 4.5 కి.మీ నుండి 5.8 కి.మీ ఎత్తు మధ్య కొనసాగుతున్న షీర్ జోన్. తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు. 20వ తేదీన ఈశాన్య బంగాళాఖాతం లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం. ఈరోజు ఆదిలాబాద్ ,కొమురం భీం , నిర్మల్ ,నిజామాబాద్, కామారెడ్డి ,జగిత్యాల, రాజన్న సిరిసిల్ల,మెదక్ ,సిద్దిపేట , వికారాబాద్, సంగారెడ్డి హైదరాబాద్ ,రంగారెడ్డి, నారాయణపేట, యాదాద్రి భువనగిరి ,నాగర్కర్నూల్, వనపర్తి , జోగులాంబ గద్వాల్, నల్గొండ ,మహబూబ్నగర్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం.
  • LRS చార్జీల్లో కొంత ఊరట. ప్రస్తుతం ఉన్న మార్కెట్ రేటును వర్తింపజేస్తూ బేసిక్ రెగ్యులరేషన్ చార్జీలు తగ్గించిన ప్రభుత్వం. 3000 వేల మార్కెట్ రేటు ఉంటే బేసిక్ ఛార్జ్ 25 శాతం నుంచి 20 శాతానికి తగ్గింపు. 3000 నుంచి 5000 వరకు మార్కెట్ రేటు ఉంటే 50 % నుంచి 30% తగ్గింపు. 5000 నుంచి 10000 వరకు 40 % బేసిక్ ఛార్జ్ LRS బేసిక్ చార్జీలను 4 స్లాబుల నుంచి 7 స్లాబులకు పెంచిన ప్రభుత్వం.
  • విజయవాడ: పైలా సోమినాయుడు, దుర్గగుడి చైర్మన్. 2016 లో టీడీపీ హయాంలో ఘాట్ రోడ్డు లో ఉన్న రధాన్ని తీసుకెళ్లి జమ్మిదోడ్డి లో పెట్టారు. ఆ తరువాత మహామండపం కింద పెట్టారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక రధాన్ని వాడలేదు. లాక్ డౌన్ వల్ల ఊరేగింపులు రద్దు అయ్యాయి. టీడీపీ హయాంలో, పాత ఈవో ఉన్నపుడు కప్పిన కార్పెట్ ని ఇప్పటి వరకు మేము తీయలేదు. అంతర్వేది ఘటన తరువాత రధాన్ని భద్రత కల్పచాలని తీసాం. నిన్న స్ట్రాంగ్ రూమ్ లో చెక్ చేసాం అక్కడ కూడా విగ్రహాలు లేవు. మూడు సింహాలను తయారు చేయిస్తున్నాం. వీలైనంత త్వరగా విగ్రహాలు చెపిస్తాం. సెక్యూరిటీ ఏజెన్సీ విగ్రహాలు చేపిస్తామని ఈఓ కి లిఖితపూర్వకంగా ఇచ్చారు.
  • తిరుమల: నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.69.60 లక్షలు. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 13,351 మంది భక్తులు. తలనీలాలు సమర్పించిన 4,432 మంది భక్తులు. రేపు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ. ఈ నెల 19 నుంచి 27 వరకు శ్రీవారి ఆలయంలో.. ఏకాంతంగా సాలకట్ల బ్రహ్మోత్సవాలు. ఈ నెల 23న గరుడ వాహన సేవ శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్‌.
  • ఈఎస్ఐ స్కాం లో ఈడి దర్యాప్తు ముమ్మరం. దేవిక రాణి భర్త గురుమూర్తి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న ఈడి. పీఎంజే జ్యువెలర్స్ లో 7 కోట్ల కు పైగా విలువ చేసే బంగారం కొనుగోలు చేసిన దేవిక రాణీ. బంజారాహిల్స్ పీఎంజే జువెలర్స్ యాజమానుల స్టేట్మెంట్ రికార్డ్ చేసిన ఈడి. నిధులు మళ్లించడానికి అనేక షెల్ కంపెనీలు ఏర్పాటు చేసుకున్న ఐ ఎం ఎస్ నిందితులు.
  • డ్రాగన్‌ నిఘాపై దర్యాప్తు: ఢిల్లీ: చైనా డిజిటల్‌ గూఢచర్యంపై దర్యాప్తుకు భారత ప్రభుత్వం సిద్ధం . భారతీయులపై చైనా డిజిటల్‌ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్రం . దర్యాప్తు చేపట్టేందుకు జాతీయ సైబర్‌ సెక్యూరిటీ కోఆర్డినేటర్‌ నేతృత్వంలో కమిటీ . 10వేలమంది భారతీయులపై డిజిటల్‌ నిఘా పెట్టిందంటూ ఆరోపణలు . ఈ జాబితాలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌, ప్రధాని మోదీ సహా.. అనేక మంది ప్రముఖులు ఉన్నట్లు సమాచారం . చైనాకు చెందిన సమాచార సాంకేతిక కంపెనీ జెన్‌హువాపై దర్యాప్తుకు సిద్ధం . ఈ కంపెనీకి చైనా కమ్యూనిస్ట్‌ పార్టీతో సంబంధాలున్నాయంటూ సమాచారం.
  • జనసేన: స్ఫూర్తివంతమైన నాయకుడు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రేమపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు....పవన్ కళ్యాణ్. ప్రజాప్రతినిధులుగా ఎందరికో అవకాశం కల్పిస్తుంది మన పుణ్యభూమి. అందులో కొందరే ప్రజల హృదయాలలో చిరస్థాయిగా మిగిలిపోతారు. వారి నిబద్ధత, సేవాతత్పరత, నిస్వార్థం, నిశ్చలత్వం, ధృడ సంకల్పం, ధృడ నిర్ణయం, దేశభక్తి వంటి ఉదాత్త లక్షణాలు కలవారికి ప్రజలు బ్రహ్మరథం పడతారు. అటువంటి ప్రజాపాలకులలో ఈతరంలో గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు అగ్రస్థానంలో ఉంటారు.

ప్రపంచవ్యాప్తంగా 30 మిలియన్లు దాటిన కరోనా కేసులు..

ప్రపంచ వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 30,086,029కి చేరింది. అలాగే ఇప్పటివరకూ వరల్డ్ వైడ్‌గా 945,955 మంది కరోనాతో మరణించారు. ఇక 21,833,560 మంది కోవిడ్‌తో కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
Corona Cases In World, ప్రపంచవ్యాప్తంగా 30 మిలియన్లు దాటిన కరోనా కేసులు..

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకీ కోవిడ్ మహమ్మారి వికృత రూపం దాల్చుతోంది. రోజూ కొత్తగా కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. కాగా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 30,086,029కి చేరింది. అలాగే ఇప్పటివరకూ వరల్డ్ వైడ్‌గా 945,955 మంది కరోనాతో మరణించారు. ఇక 21,833,560 మంది కోవిడ్‌తో కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. (Corona Cases In World)

ఇక అమెరికాలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చుతోంది. ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 6,829,847కి చేరింది. అలాగే ఈ వైరస్ వల్ల ఇప్పటివరకూ అమెరికాలో 201,403 మంది మృతి చెందారు. ఇక బ్రెజిల్, రష్యా, కొలంబియా, పెరు, మెక్సికో, దక్షిణాఫ్రికాలలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. అటు ఇండియాలో ఇప్పటివరకు 5,128,918 కేసులు నమోదు కాగా.. 83,338 మంది వైరస్ కారణంగా మరణించారు.

Also Read:

ఏపీ వాహనదారులకు అలెర్ట్.. లైట్ తీసుకుంటే ఇక అంతే!

అమెరికాను వణికిస్తున్న కొత్త రకం ‘బ్యాక్టీరియా’.!

బిగ్ బాస్ 4: ఈ సీజన్‌లో ఆమెదే భారీ రెమ్యునరేషన్

కేంద్రం మరో సంచలనం.. త్వరలోనే హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్.!

బిగ్ బాస్ హౌస్‌లోకి రామ్‌చరణ్ హీరోయిన్..!

Related Tags