ప్రపంచవ్యాప్తంగా మిలియన్‌కు చేరువలో కరోనా మరణాలు..

Corona Cases In World: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకీ కోవిడ్ మహమ్మారి వికృత రూపం దాల్చుతోంది. రోజూ కొత్తగా కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. కాగా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 33,105,120కి చేరింది. అలాగే ఇప్పటివరకూ వరల్డ్ వైడ్‌గా 999,449 మంది కరోనాతో మరణించారు. ఇక 24,452,180 మంది కోవిడ్‌తో కోలుకుని ఆస్పత్రి నుంచి […]

ప్రపంచవ్యాప్తంగా మిలియన్‌కు చేరువలో కరోనా మరణాలు..
Follow us

|

Updated on: Sep 27, 2020 | 6:46 PM

Corona Cases In World: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకీ కోవిడ్ మహమ్మారి వికృత రూపం దాల్చుతోంది. రోజూ కొత్తగా కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. కాగా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 33,105,120కి చేరింది. అలాగే ఇప్పటివరకూ వరల్డ్ వైడ్‌గా 999,449 మంది కరోనాతో మరణించారు. ఇక 24,452,180 మంది కోవిడ్‌తో కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. నిన్న ఒక్క రోజు ప్రపంచంలో 2,94,625 పాజిటివ్ కేసులు, 5306 మరణాలు సంభవించాయి.

అమెరికాలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చుతోంది. ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 7,288,932కి చేరింది. అలాగే ఈ వైరస్ వల్ల ఇప్పటివరకూ అమెరికాలో 209,196మంది మృతి చెందారు. ఇక బ్రెజిల్, రష్యా, కొలంబియా, పెరు, మెక్సికో, దక్షిణాఫ్రికాలలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. అటు ఇండియాలో ఇప్పటివరకు 5,996,823 కేసులు నమోదు కాగా.. 94,559 మంది వైరస్ కారణంగా మరణించారు.

Also Read:

మందుబాబులకు కిక్కిచ్చే వార్త.. ఆన్‌లైన్‌లో మద్యం అమ్మకాలు.!

బ్రూసెల్లోసిస్‌… తస్మాత్ జాగ్రత్త.!

ఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీ.. ఆ ప్రదేశాల్లో లిక్కర్ షాపులకు నో పర్మిషన్..

కరోనాపై ఎస్పీ బాలు చివరి పాట.. ఎంత మధురంగా పాడారంటే.!

సెప్టెంబర్ 25.. టాలీవుడ్ ఇండస్ట్రీకి బ్లాక్ డే..