దేశ రాజధానిలో కరోనా వ్యాప్తి ఇలా ఉంది…

ఢిల్లీలో క‌రోనా మ‌హ‌మ్మారి ఉధృతి కొన‌సాగుతున్న‌ది. శుక్ర‌వారం కూడా కొత్త‌గా 4,127 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో ఆ రాష్ట్రంలో న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య 2,38,828కి చేరింది...

దేశ రాజధానిలో కరోనా వ్యాప్తి ఇలా ఉంది...
Follow us

|

Updated on: Sep 18, 2020 | 9:29 PM

దేశ రాజధానిలో కోవిడ్ మహమ్మారి రోజు రోజుకు విస్తరిస్తోంది. నిత్యం నాలుగు వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. మొత్తం రెండు లక్షల మార్కును కూడా దాటేసింది. దీంతో ఢిల్లీలోని ప్రజలు భయంతో వణికిపోతున్నారు. వాతావరణంలో వస్తున్న మార్పులకు తోడు కరోనా పాజిటివ్ కేసులు పెగుతుండటం వైద్యులు, పరిశోధకులకు ఆందోళన కలిగిస్తోంది.

ఢిల్లీలో క‌రోనా మ‌హ‌మ్మారి ఉధృతి కొన‌సాగుతున్న‌ది. శుక్ర‌వారం కూడా కొత్త‌గా 4,127 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో ఆ రాష్ట్రంలో న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య 2,38,828కి చేరింది. అందులో 2,01,671 మంది ఇప్ప‌టికే వైర‌స్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మ‌రో 32,250 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

క‌రోనా మ‌ర‌ణాలు కూడా ఢిల్లీలో భారీగానే న‌మోద‌వుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 30 మందిని కరోనా బలితీసుకుంది. దాంతో మృతుల సంఖ్య 4,907కు చేరింది. ఢిల్లీ ఆరోగ్య శాఖ అధికారులు ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు.