తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతోన్న కరోనా ఉధృతి

కరోనా తీవ్రత తెలుగు రాష్ట్రాలతోపాటు పక్కనున్న తమిళనాడులోనూ కొనసాగుతోంది. తెలంగాణలో శనివారం 2,398 కరోనా కేసులు నమోదుకాగా, 11 మంది మృతి చెందారు. దీంతో తెలంగాణలో మొత్తం 1,83,866 కరోనా కేసులు నమోదవ్వగా, మొత్తం మరణాలు 1,091 గా ఉన్నాయి. యాక్టివ్‌ కేసులు 30,334. ఇప్పటి వరకు 1,52,441 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం కేసులు 58,821 నమోదయ్యాయి. అటు ఏపీలోనూ కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రంలో నిన్న(శనివారం) 7,293 కరోనా కేసులు నమోదుకాగా, 57 […]

తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతోన్న కరోనా ఉధృతి
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 27, 2020 | 3:57 PM

కరోనా తీవ్రత తెలుగు రాష్ట్రాలతోపాటు పక్కనున్న తమిళనాడులోనూ కొనసాగుతోంది. తెలంగాణలో శనివారం 2,398 కరోనా కేసులు నమోదుకాగా, 11 మంది మృతి చెందారు. దీంతో తెలంగాణలో మొత్తం 1,83,866 కరోనా కేసులు నమోదవ్వగా, మొత్తం మరణాలు 1,091 గా ఉన్నాయి. యాక్టివ్‌ కేసులు 30,334. ఇప్పటి వరకు 1,52,441 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం కేసులు 58,821 నమోదయ్యాయి. అటు ఏపీలోనూ కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రంలో నిన్న(శనివారం) 7,293 కరోనా కేసులు నమోదుకాగా, 57 మంది మృతి చెందారు. ఏపీలో మొత్తం 6,68,751 కేసులు నమోదుకాగా, 5,663 మంది మృతి చెందారు. యాక్టివ్‌ కేసులు 65,794 గా ఉన్నాయి.. ఇప్పటి వరకు 5,97,294 మంది డిశ్చార్జ్ అయ్యారు.

అటు, తమిళనాట కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తమిళనాడులో నిన్న(శనివారం) 5,647 కేసులు నమోదయ్యాయి, 85 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 9,233 మంది కరోనాతో మృతి చెందారు. తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,75,017 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చెన్నైలో మొత్తం పాజిటివ్ కేసులు 1,62,125గా ఉన్నాయి.