కరోనా ఎఫెక్ట్‌: మున్సిపల్ శాఖ కీలక నిర్ణయం..

గత కొన్ని నెలలుగా కరోనా మహమ్మారి ప్రపంచ దేశానలు పట్టిపీడిస్తోంది. ఇటు భారత్‌లోనూ కోవిడ్‌ కారణంగా పిట్టల్లా ప్రాణాలు పోతున్నాయి. దేశంలో విజృంభిస్తున్న కరోనా కారణంగా ప్రజలు ఇంటి నుండి కాళ్లు బయటపెట్టాలంటేనే భయపడిపోతున్నారు. ఇటువంటి తరుణంలో

కరోనా ఎఫెక్ట్‌: మున్సిపల్ శాఖ కీలక నిర్ణయం..
Follow us

|

Updated on: Jul 15, 2020 | 6:10 PM

గత కొన్ని నెలలుగా కరోనా మహమ్మారి ప్రపంచ దేశానలు పట్టిపీడిస్తోంది. ఇటు భారత్‌లోనూ కోవిడ్‌ కారణంగా పిట్టల్లా ప్రాణాలు పోతున్నాయి. దేశంలో విజృంభిస్తున్న కరోనా కారణంగా ప్రజలు ఇంటి నుండి కాళ్లు బయటపెట్టాలంటేనే భయపడిపోతున్నారు. ఇటువంటి తరుణంలో ఉపాధి కూలీలు, కార్మికులు అనేక కష్టాలు పడుతున్నారు. ఇప్పటికే వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన కార్మికులు కూడా స్వస్థలాలకు తిరిగి వచ్చేశారు. దీంతో దేశవ్యాప్తంగా ఉపాధిలేని ఎంతో మంది అనేక ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కరోనా కారణంగా 60ఏళ్లు పైబడిన వారిని కొన్ని చోట్లకు విధులకు అనుమతించటం లేదు. 60 ఏళ్లకు పైబడిన పారిశుధ్య కార్మికులు పనిలోకి రావొద్దని మునిసిపల్‌ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సంబంధిత కమిషనర్లను మునిసిపల్‌ శాఖ సంచాలకుడు సత్యనారాయణ ఆదేశించారు.

విస్తరిస్తున్న వైరస్‌ వ్యాప్తి కారణంగా పారిశుధ్య విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌లో కార్మికులు అనారోగ్యం బారిన పడుతున్నారని అధికారులు వెల్లడించారు. అయితే, 60 ఏళ్లకు పైబడిన వారి స్థానంలో వారి కుటుంబ సభ్యుల నుంచి ఎవరినైనా విధుల్లోకి తీసుకోవచ్చని వర్క్‌ ఏజెన్సీలకు మునిసిపల్‌ శాఖ సూచించింది. కొత్తగా పనిలోకి తీసుకునే కార్మికుల వయసు 25 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండేలా చూడాలని ఆదేశించింది. కుటుంబ సభ్యులు అందుబాటులో లేనిపక్షంలో ఇతరులను ఎంపిక చేయాలని మున్సిపల్‌ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!
మహిళలకు తోడుగా కదం తొక్కుతున్న మగ మహరాజులు..!