క‌రోనా అల‌ర్ట్ః ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హాట్స్‌స్పాట్స్ ఇవే..

రెండు రాష్ట్రాల్లోనూ వైర‌స్ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉన్న ప్రాంతాల‌ను గుర్తించారు. వాటిని హాట్‌స్పాట్స్‌గా ప్ర‌క‌టించారు. ఆయా ప్రాంతాల్లో క‌ఠిన నిబంధ‌న‌లు అమ‌లు చేస్తున్నారు. 144 నిబంధ‌నలు కొన‌సాగిస్తున్నారు...

క‌రోనా అల‌ర్ట్ః ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హాట్స్‌స్పాట్స్ ఇవే..
Follow us

|

Updated on: Apr 08, 2020 | 6:40 PM

తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల‌ను క‌రోనా క‌ల‌వ‌ర‌పెడుతోంది. వైర‌స్ మ‌హ‌మ్మారి అంత‌కంత‌కూ విస్త‌రిస్తోంది. రోజురోజుకూ ప‌దుల సంఖ్య‌లో కొత్త కేసులు న‌మోదు కావ‌డం ప్ర‌జ‌ల‌ను, అధికార యంత్రాంగానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు వెల్ల‌డైన అధికారిక లెక్క‌ల ప్ర‌కారం రెండు తెలుగు రాష్ట్రాల్లో క‌లిపి 733 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఇంకా వేల సంఖ్య‌లో బాధితులు ఐసోలేష‌న్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. అనేక మందిలో వ్యాధి ల‌క్ష‌ణాలు గుర్తించిన అధికారులు వారిని క్వారంటైన్‌కు త‌ర‌లించారు.

ఢిల్లీ మ‌ర్క‌జ్ ప్రార్థ‌న‌ల అనంత‌రం ఇటు తెలంగాణ‌, అటు ఏపీల‌లో క‌రోనా కేసులు విప‌రీతంగా పెరిగిపోయాయి. దీంతో ఢిల్లీ ప్రార్థ‌న‌ల‌కు వెళ్లిన వారిపై య‌త్రాంగం ప్ర‌త్యేక దృష్టి సారించింది. వారితో ట‌చ్‌లో ఉన్న‌వారంద‌రినీ గుర్తించి క్వారంటైన్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో రెండు రాష్ట్రాల్లోనూ వైర‌స్ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉన్న ప్రాంతాల‌ను గుర్తించారు. వాటిని హాట్‌స్పాట్స్‌గా ప్ర‌క‌టించారు. ఆయా ప్రాంతాల్లో క‌ఠిన నిబంధ‌న‌లు అమ‌లు చేస్తున్నారు. 144 సెక్షన్ నిబంధ‌న‌లు కొన‌సాగిస్తున్నారు.

కోవిడ్ -19 కేసులు 400లు దాటిన నేపథ్యంలో తెలంగాణాలో 100కు పైగా కరోనా క్లస్టర్లను ప్రభుత్వం గుర్తించినట్లు సమాచారం. ఏప్రిల్ 14 తరువాత ఒకవేళ లాక్‌డౌన్ ఎత్తేసినా, రాష్ట్రంలో కరోనా వైరస్‌ సంపూర్ణ నియంత్రణ కోసం ఈ హాట్‌స్పాట్లలో మాత్రం నిర్బంధం పూర్తి స్థాయిలో కొనసాగే అవకాశాలు ఉన్నాయి. నిత్యావసర సరుకుల కోసం కూడా ఈ ప్రాంతాలలో జన సంచారాన్ని అనుమతించకపోవచ్చని తెలుస్తోంది.

ఏపీలో సోమ‌వారం వ‌ర‌కు 63 హాట్‌స్పాట్లను గుర్తించారు., ఆయా ప్రాంతాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలూ చేపడుతోంది. కరోనా నుంచి రక్షణ, చికిత్స‌ కోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం 12 వేల పర్సనల్‌ ప్రొటెక్షన్‌ ఎక్విప్‌మెంట్‌ (PPE) లను అందుబాటులో ఉంచారు. 20 వేల ఎన్–95 మాస్క్ లు, 40 లక్షల సర్జికల్‌ గ్లౌజులు, 40 లక్షల గ్లౌజులు 12 లక్షల మాస్కులు ఉన్నాయి. అధికార వర్గాలు వెల్లడించిన మేరకు అదనంగా పీపీఈలు, 20 లక్షల ఎన్-95 మాస్కుల కోసం ఆర్డర్ ఇచ్చారు. అలాగే మూడు లక్షల ర్యాపిడ్ టెస్ట్ కిట్ల కోసం కూడా ఆర్డర్ ఇచ్చిన‌ట్లుగా తెలుస్తోంది.

ఏపీలో కరోనా కేసుల సంఖ్య మంగళవారం నాటికి తగ్గుముఖం పట్టినా.. బుధవారం మళ్లీ పెరిగాయి. రాష్ట్రంలో మంగళవారం రాత్రి 10 గంటల నుంచి.. బుధవారం ఉదయం 10 గంటల వరకునమోదైన కోవిడ్19 పరీక్షల్లో.. మరో 15 నమోదయ్యాయి. తాజాగా నెల్లూరు జిల్లాలో 6, కృష్ణా జిల్లాలో 6, చిత్తూరులో 3 కేసు లు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 329కు పెరిగింది. కాగా క‌ర్నూలులోనే అత్య‌ధిక పాజిటివ్ కేసులు న‌మోదుకావ‌డంతో జిల్లా వ్యాప్తంగా హై అల‌ర్ట్ ప్ర‌క‌టించారు.

విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!
ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!
అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక
అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక
హీరో అతనే .. విలనూ అతనే.! కంగువ నుంచి బిగ్ అప్డేట్..
హీరో అతనే .. విలనూ అతనే.! కంగువ నుంచి బిగ్ అప్డేట్..