తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ..

రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. ఒక రోజు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుంటే.. మరొక రోజు తగ్గుతూ ఉన్నాయి. కాగా  తెలంగాణలో బుధవారం 24 గంటల్లో 127 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. రాష్ట్రంలో క‌రోనా ప‌రిస్థితిపై నిన్న రాత్రి 8 గంట‌ల‌కు...

తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ..
Follow us

| Edited By:

Updated on: Jun 04, 2020 | 8:41 AM

రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. ఒక రోజు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుంటే.. మరొక రోజు తగ్గుతూ ఉన్నాయి. కాగా  తెలంగాణలో బుధవారం 24 గంటల్లో 127 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. రాష్ట్రంలో క‌రోనా ప‌రిస్థితిపై నిన్న రాత్రి 8 గంట‌ల‌కు బులిటెన్ విడుద‌ల చేసింది ఆరోగ్య శాఖ‌. రాష్ట్రంలో మంగళవారం సాయం‌త్రం ఐదు గంట‌ల నుంచి బుధవారం సాయంత్రం ఐదు గంట‌ల మ‌ధ్య న‌మోదైన కొవిడ్-19 కేసుల వివ‌రాల‌ను వెల్ల‌డించింది. ఈ 24 గంట‌ల వ్య‌వ‌ధిలో రాష్ట్రానికి చెందిన‌ లోక‌ల్స్ లో 125 మందికి, మ‌రో ఇద్దరు వ‌ల‌స కార్మికుల‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో రాష్ట్రంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3020కి చేరింది. ఇందులో స్థానికులు 2572 మంది, విదేశాల నుంచి తిరిగి వ‌చ్చిన‌వారు, వ‌ల‌స కూలీలు 448 మంది ఉన్నారు.

అత్య‌ధికంగా జీహెచ్ఎంసీలో 108 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. రంగారెడ్డి జిల్లాలో 6, అసిఫాబాద్ జిల్లాలో 6, మేడ్చ‌ల్ జిల్లాలో 2, సిరిసిల్ల జిల్లాలో 2, యాదాద్రి , కామారెడ్డి, మహబూబాబాద్ జిల్లాలో ఒక్కొక్క కేసు చొప్పున న‌మోద‌య్యాయి. కరోనాతో బుధవారం ఒక్కరు కూడా చనిపోలేదని తెలిపిన ఆరోగ్య శాఖ.. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 99కు చేరింది. ఇక 1556 మంది క‌రోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. ప్ర‌స్తుతం 1365 మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఇక ఏపీ విషయానికొస్తే.. రాష్ట్రంలో కొత్తగా 79 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ కోవిడ్ కేసులు మొత్తం 3279కి చేరాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో ముగ్గురు మృతి చెందగా.. 35 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 967 మంది బాధితులు చికిత్స పొందుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!