తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ.. విపరీతంగా కేసులు నమోదు..

రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. ఒక రోజు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుంటే.. మరొక రోజు తగ్గుతూ ఉన్నాయి. ఇక దేశ వ్యాప్తంగా రోజుకీ వేల సంఖ్యలో కేసులు నమోదవుతుండటం కలకలం రేపుతోంది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో బుధవారం కొత్తగా 269 పాజిటివ్ కేసులు నమోదైనట్లు...

తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ.. విపరీతంగా కేసులు నమోదు..
Follow us

| Edited By:

Updated on: Jun 18, 2020 | 9:29 AM

రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. ఒక రోజు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుంటే.. మరొక రోజు తగ్గుతూ ఉన్నాయి. ఇక దేశ వ్యాప్తంగా రోజుకీ వేల సంఖ్యలో కేసులు నమోదవుతుండటం కలకలం రేపుతోంది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో బుధవారం కొత్తగా 269 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కేసుల సంఖ్య 5,675కి చేరింది. ఇందులో 2,412 యాక్టివ్ కేసులు ఉండగా.. 3,071 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇప్పటివరకు 192 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.

మరోవైపు ఇవాళ కరోనాతో ఒక్కరు మరణించగా.. 151 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా నమోదైన కేసుల్లో ఒక్క గ్రేటర్ పరిధిలోనే 214 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక జనగాంలో 5, జయశంకర్ భూపాలపల్లిలో 1, కరీంనగర్ లో 8, ఆసిఫాబాద్ లో 1, మహబూబ్ నగర్ 1, మెదక్ 3, మేడ్చల్ 2, ములుగు 5, రంగారెడ్డి 13, సంగారెడ్డి 3, వికారాబాద్ 1, వనపర్తి 2, వరంగల్ అర్బన్ లో 10 కేసులు నమోదయ్యాయి. అటు ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 45,911 మందికి కరోనా టెస్టులు చేయగా.. అందులో 40,236 మందికి కరోనా నెగటివ్ గా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ తాజాగా బులిటెన్ లో పేర్కొంది.

ఇక ఏపీ విషయానికొస్తే.. రాష్ట్రంలో కరోనా వైరస్ భయంకరంగా విస్తరిస్తోంది. తాజాగా బుధవారం 351 పాజిటివ్ కేసులు నమోదైన‌ట్లు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్ విడుద‌ల చేసింది. వీరిలో రాష్ట్రానికి చెందిన వారు 275 మంది కాగా, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 76 మంది కరోనా వైరస్ బారినపడ్డారు. అలాగే బుధవారం ఇద్దరు కరోనాతో చనిపోయారు. కర్నూలు జిల్లాలో ఒకరు, గుంటూరు జిల్లాలో ఒకరు మరణించారు. ఇక తాజా కేసుల‌తో క‌లిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5555కి చేరింది. అలాగే 2906 మంది కోవిడ్ నుంచి కోలుకోగా.. యాక్టివ్ కేసుల సంఖ్య 2559గా ఉంది. ఇప్పటివరకూ రాష్ట్రంలో వైరస్‌తో చనిపోయిన వారి సంఖ్య 90కి పెరిగింది. రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతుండటం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో పెద్ద ఎత్తున కరోనా టెస్టులను నిర్వహిస్తోంది.