క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆండర్సన్.. ప్రియురాలి కోరిక మేరకు అమెరికా తరపున ఆడనున్న క్రికెటర్..

స్టార్ ఆల్‌రౌండర్ కోరి ఆండర్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అమెరికా మేజర్ లీగ్ క్రికెట్(MLC) టీ20తో మూడేళ్ల పాటు ఒప్పందం కుదుర్చుకోవడంతో..

క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆండర్సన్.. ప్రియురాలి కోరిక మేరకు అమెరికా తరపున ఆడనున్న క్రికెటర్..
Follow us

|

Updated on: Dec 05, 2020 | 5:56 PM

Corey Anderson Retirement:  స్టార్ ఆల్‌రౌండర్ కోరి ఆండర్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అమెరికా మేజర్ లీగ్ క్రికెట్(MLC) టీ20తో మూడేళ్ల పాటు ఒప్పందం కుదుర్చుకోవడంతో న్యూజిలాండ్ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటిస్తున్నట్లు అధికారికంగా వెల్లడించాడు.

”కివీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం చాలా గర్వంగా ఉంది. ఇన్నేళ్ల కెరీర్‌లో ఎన్నో సాధించాను. కానీ అప్పుడప్పుడూ కొన్ని విభిన్న అవకాశాలు మనల్ని మరో దిశకు తీసుకెళ్తాయి. నాకోసం ఎంతో చేసిన న్యూజిలాండ్ క్రికెట్ బోర్డుకు ధన్యవాదాలు” అని ఆండర్సన్ పేర్కొన్నాడు. తన ప్రియురాలి కోరిక మేరకు న్యూజిలాండ్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి.. అమెరికా తరపున ఆడేందుకు నిర్ణయం తీసుకున్నట్లు అతడు వివరించాడు.

కాగా, కివీస్ జట్టు తరపున మూడు ఫార్మాట్లు కలిపి 93 మ్యాచ్‌లు ఆడిన ఆండర్సన్.. వన్డేల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ(36 బంతుల్లో) రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అటు ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లకు ఆండర్సన్ ప్రాతినిధ్యం వహించాడు.

Also Read:

Breaking: గ్రేటర్ దెబ్బ.. ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన నిర్ణయం.. టీపీసీసీ చీఫ్ పదవికి రాజీనామా..

కాంట్రాక్టు ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. సర్వీసు గడువును పొడిగిస్తూ కీలక ఉత్తర్వులు జారీ..

బిగ్ బాస్ 4: ఆ ఇద్దరూ టాప్ 2లో ఉండాలి.. ప‌నికి రానోళ్ల‌ను తోసేయండి: రాహుల్ సిప్లిగంజ్

డార్క్ చాక్లెట్‌తో కరోనాకు చెక్ పెట్టొచ్చు.! తాజా పరిశోధనల్లో సంచలన విషయాలు వెల్లడి..