బన్నీ కొత్త చిత్రానికి కాపీ మరక..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఏడాది గ్యాప్ తీసుకుని.. ఎట్టకేలకు తన కొత్త చిత్రం షూటింగ్‌లో ఈ నెల 24 నుంచి పాల్గొనున్నాడు. త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదిలా ఉంటే తన పుట్టిన రోజు నాడు ఏకంగా మూడు ప్రాజెక్ట్స్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అభిమానులను ఆశ్చర్యపరిచాడు బన్నీ.

అయితే వాటి గురించి ఎటువంటి అప్డేట్స్ రాలేదు గానీ.. ఒకటి సుకుమార్ డైరెక్షన్‌లో.. మరొకటి వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో ఉండబోతోంది. ఇక వేణు శ్రీరామ్ దర్శకత్వంలో చేయబోయే సినిమా మీద సోషల్ మీడియాలో అప్పుడే కాపీ మరకలు పడటం చర్చకు దారి తీస్తోంది. ‘ఐకాన్’ అనే టైటిల్ తో తెరకెక్కబోయే ఈ చిత్రానికి.. రెండేళ్ల క్రితం ఫిలిప్పైన్స్ లో వచ్చిన కిటకిట అనే సినిమా నుంచి స్ఫూర్తి పొందారట.

ఇక ఆ సినిమా కాన్సెప్ట్ ఏమిటంటే.. అనుకోకుండా కళ్ళు పోగొట్టుకున్న హీరోయిన్.. హీరో కోసం వెతికే క్రమంలో ఎన్నో సంఘటనలు ఎదుర్కొనడం.. అప్పుడే ఇద్దరు కలిసి ప్రయాణం చేయడం మొదలుపెడతారు. పైగా ఇది స్టార్ హీరో చేయాల్సిన సబ్జెక్టు కూడా కాదట. అక్కడ నేటివిటీకి తగ్గట్టు ఇందులో చాలా డ్రామా జోడించారు. అయితే మన దగ్గర మాత్రం చాలానే మార్పులు చేయాల్సి ఉంటుంది.

ఇది జస్ట్ గాసిప్పా లేక నిజమా అనేది తెలియాల్సి ఉండగా.. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న ఈకాలంలొ ఇలాంటి న్యూస్‌లు ఎన్నో సోషల్ మీడియాలో పుట్టుకొస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *