Breaking News
  • అనంతపురం: ఎస్‌ఆర్‌ఎస్‌ ట్రావెల్స్‌ నిర్వాకం. పెనుకొండ దగ్గర నిలిచిపోయిన ఎస్‌ఆర్‌ఎస్‌ ట్రావెల్స్‌ బస్సు. రాత్రి నుంచి బస్సులోనే ప్రయాణికుల పడిగాపులు. బస్సును రోడ్డుపై వదిలి పరారైన డ్రైవర్‌, క్లీనర్‌. బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న బస్సు. మార్గం మధ్యలో బస్సుకు ఆరుసార్లు మరమ్మతులు. పట్టించుకోని ఎస్‌ఆర్‌ఎస్‌ ట్రావెల్స్‌ యాజమాన్యం. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూపాలంటున్న ప్రయాణికులు.
  • చెన్నై ఐఐటీలో మరో వివాదం. ప్రాజెక్ట్ మేనేజర్‌ బెనర్జీపై విద్యార్థినుల ఫిర్యాదు. మొబైల్‌ఫోన్‌తో బాత్‌రూమ్‌లో వీడియోలు తీస్తున్నాడని ఆరోపణ. పోలీసులకు ఫిర్యాదు చేసిన విద్యార్థినులు. బెనర్జీ ఫోన్‌ను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపిన పోలీసులు. కేసునమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు.
  • నెల్లూరు: మర్రిపాడు మండలం అల్లంపాడులో ముగ్గురు అరెస్ట్‌. గుప్తనిధులు తవ్వకాలు చేస్తున్నారన్న అనుమానంతో అరెస్ట్‌. పరారీలో మరో ఇద్దరు, కారు స్వాధీనం.
  • ప్రధాని అధ్యక్షతన 2016లో జరిగిన సమావేశంలో.. అన్నిరాష్ట్రాల్లో టెలీహెల్త్‌ సర్వీస్‌ ప్రారంభించాలని ఆదేశించారు. ఏపీ కార్మికశాఖ ఆధ్వర్యంలో ఈఎస్‌ఐ అధికారులతో సమావేశం నిర్వహించాం. తెలంగాణలో అమలులో ఉన్నందున అదే విధానాన్ని అమలు చేయమని చెప్పా. తెలంగాణ ఈఎస్‌ఐ అధికారులు టెలీ హెల్త్ సర్వీస్‌తో.. ఎంవోయూ చేసుకోమనడంతో నేను లెటర్‌ రాశా. నామినేషన్‌ పద్ధతిలో కాకుండా టెండర్ల పద్ధతి ద్వారా.. మందులు కొనుగోలు చేయాలని మంత్రిగా ఆదేశించా-అచ్చెన్నాయుడు.
  • కార్మికుల సొమ్ముదోచుకున్న అచ్చెన్నాయుడును వెంటనే అరెస్ట్‌ చేయాలి. ఈఎస్‌ఐ కుంభకోణాన్ని వెలికి తీయాలి-వైసీపీటీయూసీ నేత గౌతమ్‌రెడ్డి. ఇందులో ఎవరెవరు భాగస్వాములో కూడా వెల్లడించాలి. అచ్చెన్నాయుడును అన్ని వాస్తవాలు బయటకు వస్తాయి-గౌతమ్‌రెడ్డి.

విజయ్‌కే ఎందుకిలా జరుగుతోంది…

Thalapathy Vijay Bigil Movie Update, విజయ్‌కే ఎందుకిలా జరుగుతోంది…

ఇటీవల విడుదలైన ఏ సినిమా అయినా.. అది కాపీ ఇష్యూ వివాదంలో ఇరుక్కోవడం జరుగుతోంది. టాలీవుడ్, కోలీవుడ్.. ఇండస్ట్రీ ఏదైనా సినిమా చుట్టూ వివాదాలు ఇప్పుడు కచ్చితంగా ఉంటున్నాయి. జబర్దస్త్, శ్రీమంతుడు, ఇస్మార్ట్ శంకర్, అదిరింది.. ఇలా పలు చిత్రాలు విడుదలకు ముందు ఇలాంటి ఉదంతంలో చిక్కుకున్నాయి. ఇక తాజాగా ఆ కోవలోకి తమిళ హీరో విజయ్ చిత్రం చేరింది.

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా దర్శకుడు అట్లీ కుమార్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘బిగిల్’.. దీపావళీ కానుకగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది. ఈ మూవీ కథ తనదే అంటూ ఓ రచయిత, దర్శకుడు తెలంగాణ రచయితల సంఘంలో కంప్లయింట్ చేశాడు. తెలుగులో పలు షార్ట్ ఫిలిమ్స్ డైరెక్ట్ చేసిన నంది చిన్న కుమార్ అనే వ్యక్తి ఈ ఆరోపణలు చేసినట్లు సమాచారం. తన కథను కాపీ కొట్టి ‘బిగిల్’ సినిమా తెరకెక్కించారని.. చిత్ర యూనిట్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే తన కథను పూర్తిగా బిగిల్ యూనిట్ తీసుకోలేదని.. కేవలం మెయిన్ పాయింట్‌ను మాత్రమే తీసుకుని తెరకెక్కించారని చిన్న కుమార్ ఆరోపిస్తున్నారు. అతడు ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన తెలంగాణ రచయిత సంఘం విచారణ చేపట్టింది.

మరోవైపు ‘బిగిల్’ చిత్రంపై తమిళనాడులో కూడా పలు ఇలాంటి తరహా ఆరోపణలే ఎదురయ్యారు. దర్శకుడు కేపీ సెల్వ కూడా బిగిల్ కథ నాదే అంటూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. కానీ ఇప్పటివరకు ఈ విషయంపై చిత్ర యూనిట్ మాత్రం స్పందించలేదు. అయితే ఇదొక్కటే కాదు విజయ్ ఇటీవల నటించిన చాలా చిత్రాలు కాపీ వివాదాల్లో చిక్కుకున్నాయి. ‘మెర్సల్’, ‘సర్కార్’ సినిమాల విడుదల సమయంలో దర్శకనిర్మాతలు చాలా అడ్డంకులు ఎదుర్కొన్నారు.

దాదాపు 180 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. దర్శకుడు అట్లీ కుమార్ రూపొందించిన ఈ చిత్రాన్ని ఏజీఎన్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించింది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో అక్టోబర్ 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇక తెలుగులో విజిల్ పేరుతో ఈ మూవీ రిలీజ్ అవుతోంది.

Related Tags