Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 51 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 151767 దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 83004 కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 64426 దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 4337 కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ
  • కరోనా తెలంగాణా బులిటిన్. ఇవ్వాళ తాజాగా 71 పాజిటివ్ కేసులు నమోదు. మొత్తం రాష్ట్రంలో 1991 కరోనా పాజిటివ్ కేసులు . ఇవ్వాళ మృతులు 1. మొత్తం ఇప్పటివరకు 57 మంది కరోనా కు బలి అయ్యారు. యాక్టీవ్ కేసులు 650 మంది చికిత్స పొందుతున్నారు.
  • ఈ రోజు ఒకరికి CRPF జవాన్ కి కరోనా పాజిటివ్ ఉన్నట్లు దృవీకరించిన వైద్యులు. దేశ వ్యాప్తంగా మొత్తం 369 CRPF సిబ్బందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు దృవీకరణ 141 యాక్టీవ్ కేస్ లు. 226 మంది డిశ్చార్జ్. ఇద్దరు మృతి.
  • ఢిల్లీ: తబ్లిఘి జమాత్ కేసుకు సంబంధించి 294 మంది విదేశీయుల పై 15 చార్జిషీట్లను సాకేత్ కోర్టులో దాఖలు చేయనున్న ఢిల్లీ పోలీసులు.
  • ఢిల్లీ: ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నారావనే అధ్యక్షత ప్రారంభమైన ఆర్మీ కమాండర్ల సమావేశం. ఆర్మీ ఫోర్స్ టాప్ కమాండర్లు ఈ సమావేశానికి హాజరు. లడఖ్లో చైనా దురాక్రమణతో సహా అన్ని భద్రతా సమస్యల పై చర్చ.
  • భారత్-చైనా సరిహద్దులకు రిజర్వు బలగాల మొహరింపు. రక్షణ దళాల అధిపతి బిపిన్ రావత్, త్రివిధ దళాల అధిపతులతో సమావేశమైన ప్రధాని, రక్షణశాఖ మంత్రి. సరిహద్దుల్లో రోడ్లు, ఇతర నిర్మాణ పనులు ఆపొద్దని ఆదేశం. సరిహద్దుల్లో రోడ్డు నిర్మాణంపై అభ్యంతరం చెబుతున్న చైనా. మరోవైపు చైనాలో విస్తృతంగా రోడ్లు, ఎయిర్‌బేస్ ల నిర్మాణం. నేడు కోర్ కమాండర్లు, ఇతర ఉన్నతాధికారులతో ఆర్మీ సమావేశం.

‘షారుఖ్ దోస్త్ కూడా భయపడిపోయాడట’.. ఇదో ఢిల్లీ క్రైమ్ కహానీ

ఢిల్లీ అల్లర్ల సందర్భంగా గత ఫిబ్రవరి 24 న ఓ పోలీసుపై గన్ ఎక్కుపెట్టి..బెదిరించి పారిపోయిన యువకుడు షారుఖ్  అప్పటినుంచి ఎక్కడెక్కడ తిరిగాడో, ఏం చేశాడో పోలీసులు తెలిపారు.
Cops Find Gun, ‘షారుఖ్ దోస్త్ కూడా భయపడిపోయాడట’.. ఇదో ఢిల్లీ క్రైమ్ కహానీ

ఢిల్లీ అల్లర్ల సందర్భంగా గత ఫిబ్రవరి 24 న ఓ పోలీసుపై గన్ ఎక్కుపెట్టి..బెదిరించి పారిపోయిన యువకుడు షారుఖ్  అప్పటినుంచి ఎక్కడెక్కడ తిరిగాడో, ఏం చేశాడో పోలీసులు తెలిపారు. ఆ పిస్టల్ ని వారు శుక్రవారం అతని ఇంటినుంచి స్వాధీనం చేసుకున్నారు. దీంతో బాటు స్పాట్ నుంచి పారిపోయేందుకు ఇతగాడు వాడిన కారును కూడా తాము స్వాధీనం చేసుకున్నట్టు వారు చెప్పారు. ‘అది ఫిబ్రవరి  24 వ తేదీ.. సిఏఏకు వ్యతిరేకంగా ఈశాన్య ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్న సందర్భమది ! ఆ రోజున తనను పట్టుకోవడానికి వఛ్చిన ఓ పోలీసుపై గన్ ఎక్కుపెట్టాడు. ఒకసారి కాల్పులు జరపగా తూటా ఆ పోలీసు ఎడమ వైపునుంచి దూసుకుపోయింది.Cops Find Gun, ‘షారుఖ్ దోస్త్ కూడా భయపడిపోయాడట’.. ఇదో ఢిల్లీ క్రైమ్ కహానీ

షారుఖ్ మళ్ళీ గాల్లోకి రెండు సార్లు కాల్పులు జరిపి అక్కడినించి పరారయ్యాడు. కారులో మొదట పంజాబ్ కి, ఆ తరువాత యూపీలోని షామ్లీ ప్రాంతానికి వెళ్ళాడట. (అక్కడే అతడిని గత మంగళవారం అరెస్టు చేశారు). మొదట ఫిబ్రవరి 24 న తన ఇంటికి వెళ్ళినప్పుడు.. పోలీసుపై తను గన్ ఎక్కుపెట్టిన దృశ్యాలు టీవీలో పదేపదే ప్రసారమవుతుండడంతో.. గాభరా పడి  బట్టలు మార్చుకుని ఢిల్లీలో మారుమూలన గల హౌజ్ ఖాస్ ప్రాంతానికి చేరుకొని క్లబ్బుల్లో తలదాచుకున్నంత పని చేశాడు. ఆ మరుసటి రోజున కన్నాట్ ప్లేస్ లో కారును పార్క్ చేసి అందులోనే నిద్రపోయాడని, అనంతరం పంజాబ్ లోని జలంధర్ కి వెళ్లి తన మిత్రుని సాయం కోరగా.. అప్పటికే టీవీలో ఇతగాని నిర్వాకం చూసి ఆ ‘దోస్త్’ కనీసం కలుసుకోవడానికి కూడా నిరాకరించాడని తెలిసింది. పంజాబ్ లో బస్సుల్లో తిరుగుతూ వఛ్చిన షారుఖ్ మళ్ళీ యూపీలోని షామ్లీకి చేరుకోగా అక్కడి బస్టాండ్ లో పోలీసులకు పట్టుబడ్డాడు. తను వాడిన కారు తనది కాదని, అది తన అంకుల్ కి చెందినదని షారుఖ్ చెప్పాడు. ఇతడ్ని ఖాకీలు నాలుగు రోజులపాటు తమ కస్టడీకి తీసుకున్నారు. ఇతని తండ్రి డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడి.. అనంతరం బెయిలుపై విడుదలయ్యాడట. మొత్తానికి తండ్రీ కొడుకుల క్రిమినల్ హిస్టరీ ఢిల్లీ పోలీసులకు షాకిచ్చింది.

 

 

 

Related Tags