Breaking News
  • క్వారంటైన్‌ కేంద్రాలుగా స్టార్‌ హోటళ్లు. భువనేశ్వర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 12 హోటళ్లలో.. క్వారంటైన్‌కు అవసరమైన ఏర్పాట్లు చేసిన ఒడిశా ప్రభుత్వం. ముందుజాగ్రత్తగా సెల్ఫ్‌ క్వారంటైన్‌ గదిలో ఉండాలనుకునేవారు.. డబ్బులు చెల్లించి ప్రైవేట్‌ హోటళ్లలో ఉండొచ్చన్న ప్రభుత్వం. రోజుకు రూ.2,500 చొప్పున వసూలు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటన.
  • కొత్త ఔషధాన్ని అభివృద్ధి చేసిన అమెరికా శాస్త్రవేత్తలు. మానవ కణాల్లోకి కరోనా వైరస్‌ ప్రవేశించకుండా అడ్డుకునే.. కొత్త ఔషధాన్ని సిద్ధంచేసిన ఎంఐటీ శాస్త్రవేత్తలు. కరోనా ఇన్‌ఫెక్షన్‌ను త్వరగా నయం చేస్తుందని ప్రకటన.
  • ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌ బి.పి.కనుంగో పదవీకాలం పొడిగింపు. రేపటితో ముగియనున్న బి.పి.కనుంగో పదవీకాలం. కనుంగో పదవీకాలం మరో ఏడాది పాటు పొడిగిస్తూ ఆర్బీఐ ప్రకటన.
  • కోత కాదు వాయిదా. ఏపీపై కరోనా తీవ్ర ప్రభావం. ప్రజాప్రతినిధుల జీతాలు వాయిదా. సీఎం నుంచి స్థానిక సంస్థల సభ్యుల వరకు.. 100 శాతం జీతాన్ని వాయిదా వేసిన ఏపీ ప్రభుత్వం. ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారుల జీతాల్లో 60 శాతం వాయిదా. నాలుగో తరగతి ఉద్యోగుల జీతంలో 10 శాతం వాయిదా. మిగతా ఉద్యోగుల జీతంలో 50 శాతం వాయిదా. వాయిదా వేసిన జీతాలు మళ్లీ చెల్లించనున్న ఏపీ ప్రభుత్వం.
  • ఏపీలో విజృంభిస్తోన్న కరోనా వైరస్‌. ప.గో జిల్లాలో 14 పాజిటివ్‌ కేసులు నమోదు. నిన్నటి వరకు ఒక్క కేసూ లేని జిల్లాలో ఒకేసారి బయటపడ్డ 14 కేసులు. బాధితులంతా ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చినట్టు గుర్తింపు. ఏపీలో మొత్తం 58కి చేరిన కరోనా కేసులు.

అది పోలీసు లాఠీ.. ఇది తుపాకీ తూటా.. ఛిల్లింగ్ వీడియో

ఇటీవల ఢిల్లీ అల్లర్ల సందర్భంగా నిరాయుధుడై.. కేవలం ఓ లాఠీ మాత్రమే పట్టుకున్న ఓ పోలీసు అధికారికి, చేతిలో గన్ తో కాల్పులు జరిపిన ఓ యువకునికి మధ్య జరిగిన ఘర్షణ తాలూకు వీడియో సంచలనం సృష్టిస్తోంది.
cop faced protester with lathi delhi violance chilling video, అది పోలీసు లాఠీ.. ఇది తుపాకీ తూటా.. ఛిల్లింగ్ వీడియో

ఇటీవల ఢిల్లీ అల్లర్ల సందర్భంగా నిరాయుధుడై.. కేవలం ఓ లాఠీ మాత్రమే పట్టుకున్న ఓ పోలీసు అధికారికి, చేతిలో గన్ తో కాల్పులు జరిపిన ఓ యువకునికి మధ్య జరిగిన ఘర్షణ తాలూకు వీడియో సంచలనం సృష్టిస్తోంది. ఈ నెల 24 న నార్త్ ఈస్ట్ ఢిల్లీలో చెలరేగిపోయిన అల్లరిమూకలను అదుపు చేసేందుకు ఒంటరిగా వెళ్లిన దీపక్ దహియా అనే పోలీసు అధికారిని  ఆందోళనకారుడు షారుఖ్ తన గన్ తో బెదిరించి కాల్పులు జరిపాడు. ఆ ఘటనలో అతగాడు వదిలిన బులెట్ దీపక్ ఎడమవైపున కొద్దీ దూరం నుంచి దూసుకుపోయింది. దాంతో షారుఖ్ మళ్ళీ గాల్లోకి కాల్పులు జరిపి పారిపోయాడు. ఒక సమయంలో దీపక్ కి, ఇతనికి మధ్య తోపులాట జరిగింది. దగ్గరలోని ఓ భవనంపైనుంచి ఓ వ్యక్తి తన మొబైల్ తో వీరి వైనాన్ని వీడియో తీశాడు. బుల్లెట్ ఏ మాత్రం తగిలినా దీపక్ గాయపడిఉండేవాడే ! (షారుఖ్ కి క్రిమినల్ రికార్డు లేకపోయినా అతని తండ్రికి ఉందట. డ్రగ్స్ అక్రమ రవాణాకు పాల్పడినందుకు ఆ ‘తండ్రి’ ని పోలీసులు అరెస్టు చేయగా.. బెయిలుపై విడుదలయ్యాడట).

కాగా-ఢిల్లీ హింసలో మృతి చెందినవారి  సంఖ్య 42 కి, గాయపడిన వారి సంఖ్య 200 మందికి పైగా పెరిగిపోయింది. ఆందోళనకారులు ఓ స్కూలుకు నిప్పు పెట్టగా ఆ స్కూల్లోని పుస్తకాలు, ఫర్నిచర్ అంతా పూర్తిగా దగ్ధమయ్యాయి. ఓ ఇంటికి నిప్పు పెట్టగా ఆ ఇంట్లోని 85 ఏళ్ళ వృధ్ధురాలు అందులోనే చిక్కుకుని ప్రాణాలు కోల్పోయింది.  ఈ హింసకు సంబంధించి పోలీసులు 100 మందిని అరెస్టు చేశారు. సుమారు ఆరువందలమందికి పైగా అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. 123 ఎఫ్ ఐ ఆర్ లు దాఖలయ్యాయి. అయితే రెచ్ఛగొట్టే, విద్వేష పూరిత ప్రసంగాలు చేసిన బీజేపీ నేతలపై ఒక్క ఎఫ్ ఐ ఆరూ దాఖలు కాకపోవడం విశేషం.
cop faced protester with lathi delhi violance chilling video, అది పోలీసు లాఠీ.. ఇది తుపాకీ తూటా.. ఛిల్లింగ్ వీడియో

 

Related Tags