వరద సాయం.. కార్యకర్తలకు బాబు గీతోపదేశం

Cooperate with people in floods TDP Chief Chandrababu Call to party cadre, వరద సాయం.. కార్యకర్తలకు బాబు గీతోపదేశం

గోదావరిలో పెరుగుతున్న వరద ఉధృతితో పలు ప్రాంతాలు వరద ముంపునకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో బాధితులకు సహాయపడాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో ముంపు మండలాల్లో ప్రజలు ఇప్పటికే తీవ్ర   ఇబ్బందులు పడుతున్నారని, పలు పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. అనేక గ్రామాల్లో ప్రజలకు తాగునీరు లేకుండా అల్లాడిపోతున్నారని, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో పరిస్థితి దారుణంగా ఉందన్నారు చంద్రబాబు. ఈ పరిస్థితిలో టీడీపీ నేతలు సైనికుల్లా పనిచేయాలని ఆపదలో ఉన్నవారికి సేవచేయడం ఎంతో అవసరమన్నారు.

అమెరికా పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆయన రాష్ట్రంలో తాజా పరిస్థితులపై పార్టీ నేతలతో సమీక్షించారు. ఈ నేపథ్యంలో తుఫానుతో అతలాకుతలమవుతున్న ప్రాంతాల్లో సేవలందించాలని కార్యకర్తలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *