కొండెక్కి కూర్చున్న వంట నూనెల ధరలు

వంటనూనెల ధరలు పెట్రోల్‌లా మండిపోతున్నాయి.. నిత్యావసరాల వస్తువుల ధరలే కొండెక్కి కూర్చుంటే, వంట నూనెల ధరలేమో శిఖరంపై నిలుచున్నాయి.. లాక్‌డౌన్‌కు ముందు రేట్లను ఇప్పటి రేట్లను పోల్చి చూస్తే బెంబేలెత్తడం ఖాయం..

కొండెక్కి కూర్చున్న వంట నూనెల ధరలు
Follow us

|

Updated on: Oct 13, 2020 | 8:55 AM

వంటనూనెల ధరలు పెట్రోల్‌లా మండిపోతున్నాయి.. నిత్యావసరాల వస్తువుల ధరలే కొండెక్కి కూర్చుంటే, వంట నూనెల ధరలేమో శిఖరంపై నిలుచున్నాయి.. లాక్‌డౌన్‌కు ముందు రేట్లను ఇప్పటి రేట్లను పోల్చి చూస్తే బెంబేలెత్తడం ఖాయం.. కిలో నూనె ధర 30 రూపాయల నుంచి 45 రూపాయల వరకు పెరిగింది. ఇందుకు కరోనా వైరస్‌ ప్రభావమే కావచ్చు కానీ, ధరల పెరుగుదలకు ఇంకొన్ని కారణాలు కూడా ఉన్నాయి. లాక్‌డౌన్‌ అప్పుడు అందరూ ఇంటిపట్టునే ఉన్నారు.. పిండివంటలు గ్రటాలు మామూలు రోజుల కంటే కొద్దిగా ఎక్కువగానే చేసుకున్నారు.. అంటే నూనె వాడకం బాగా పెరిగింది.. మన మలేషియా, ఇండోనేషియాల నుంచి పామాయిల్‌, అర్జెంటీనా, బ్రెజిల్‌ దేశాల నుంచి సోయా నూనె, రష్యా, ఉక్రెయిన్‌ల నుంచి సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌లు దిగుమతి అవుతుంటాయి.. వీటి ధరలు కూడా ఆమాంతం పెరిగాయి.. ఇక ఇప్పుడేమో ఆన్‌లాక్‌తో దాదాపుగా ఆంక్షలన్నీ తొలగిపోయాయి.. హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు తెరచుకున్నాయి.. ఇంట్లో శుభకార్యాలు జరుగుతున్నాయి.. పంక్షన్లు జరుగుతున్నాయి.. అందుకే నూనెల వాడకం విపరీతంగా పెరిగింది.. అదే సమయంలో సరఫరా దగ్గింది.. అందుకే వంట నూనెల ధరలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం వంట నూనెల రేట్లు కిలోకు 127 రూపాయల నుంచి 145 రూపాయల వరకు ఉంది.. నిరుడు ఇదే నెలలో కిలో నూనె 85 రూపాయల నుంచి వంద రూపాయలు ఉండింది.. మార్చి నెల మధ్యలో వంద రూపాయలు ఉన్న నూనె ధర ఇప్పుడు 145 రూపాయలు అయ్యింది. రాబోయేది పండుగల సీజన్‌.. దసరా, దీపావళి సంబరాలలో పిండివంటలు తప్పనిసరి! కాబట్టి నూనె ధర ఇంకొంచెం పెరిగే అవకాశం ఉంది..

మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..