Breaking News
  • మణిపూర్ అసెంబ్లీలో బలనిరూపణలో గెలిచిన బీజేపీ. సభలో 28 మంది బీజేపీ, 16మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల హాజరు. గైర్హాజరైన 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఓటింగ్ అనంతరం నినాదాలతో హంగామా చేసిన కాంగ్రెస్. కుర్చీలను విసిరేసిన నిరసన తెలిపిన కాంగ్రెస్.
  • వెంటిలేటర్ మీద మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ కోసం చేసిన సర్జరీ విజయవంతం.
  • బెజవాడలో మరో గ్యాంగ్ వార్ ఘటన: మున్నా , రాహుల్ అనే వ్యక్తుల మధ్య ఘర్షణ. గత నెల 31 వ తేదీన కేదారేశ్వరావు పేటలో కత్తులు , కర్రలతో దాడి చేసుకున్న ఇరు వర్గాలు. దాడిలో పాల్గొన్న 11 మంది నిందితులు అరెస్ట్ చేసిన పోలీసులు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన.
  • విజయవాడ : మూడో రోజు కొనసాగనున్న అగ్నిప్రమాద ఘటనపై దర్యాప్తు. ఇప్పటికే ఎగ్రిమెంట్ పత్రాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు. కొనసాగుతున్న అరెస్టుల పర్వం. సిబ్బంది నిర్లక్ష్యం, భద్రతా ప్రమాణాలు పాటించనకపోవడమే అగ్నిప్రమాదానికి కారణమంటున్న పోలీసులు. అగ్నిప్రమాదంతో కృష్ణా జిల్లా యంత్రాంగం అలెర్ట్. కృష్ణా జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రుల వ్యవహారంపై దృష్టి. కృష్ణా జిల్లాలో ప్రభుత్వ, చిన్నా, చితకా ఆస్పత్రులు, డెంటల్‌ క్లినిక్‌లు, డయాగ్నోస్టిక్‌ కేంద్రాల 1,018 వరకు ఉన్నట్లు గుర్తింపు. వాటిలో భద్రతా ప్రమాణాలు పాటిస్తున్న 88 ప్రభుత్వ ఆస్పత్రులు, 90 ఇతర ఆస్పత్రులు. 840 ఆస్పత్రులకు అగ్నిమాపక శాఖ అనుమతులేనట్లు గుర్తింపు. చాలా ఆస్పత్రుల్లో కనిపించని అగ్నిప్రమాద నియంత్రణ ఏర్పాట్లు.
  • అమరావతి: రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, ఎగుమతి, రవాణా, డోర్ డెలివరీకు సంబంధించి ధరలను నిర్ణయించిన ప్రభుత్వం. కూలీల ద్వారా ఇసుక తవ్వకాలకు టన్నుకు రూ. 90. స్టాక్ యార్డు లో ఇసుక పొక్లెయిన్ ద్వారా లోడ్ చేసేందుకు టన్నుకు రూ. 25. ఇసుక రీచ్ లు, పట్టా ల్యాండ్ నుంచి స్టాక్ పాయింట్ కు ఇసుక రవాణా కు టన్నుకు రూ. 4.90. గోదావరి జిల్లాల నుంచి విశాఖకు ఇసుక రవాణాకు టన్నుకు రూ. 3.30. ఇసుక డోర్ డెలివరీకి కిలోమీటర్ వారీగా ధరలు నిర్దారణ. ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం కాంట్రాక్టర్లు ముందుకు రాకుంటే ఈ-టెండర్లకు వెళ్లేలా ఆదేశాలు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది.
  • తూ. గో.జిల్లా, రాజమండ్రి: ఖైదీ ఆత్మహత్య.. రాజమండ్రి సెంట్రల్ జైల్ లో ఆదివారం రాత్రి ఉరేసుకుని కరోనా ఖైదీ ఆత్మహత్య . ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. జైలులో ఇటీవల చేసిన వైద్య పరీక్షల్లో మృతుడికి కరోనా పాజిటివ్‌ అని చెబుతున్న అధికారులు. రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో మృతదేహం . కుటుంబసభ్యులు ఆసుపత్రి రావడం ఆలస్యంతో మృతదేహానికి నేడు పంచనామా . ఖైదీ స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం యర్రంపల్లి. మృతుడి భార్య, తండ్రి తదితరులు హైదరాబాదులో నివాసం. భార్యాభర్తల మధ్య తలెత్తిన మనస్పర్థల కారణంగానే ఉరేసుకుని ఉండవచ్చునని పోలీసులు, జైలు అధికారులు భావిస్తున్నారు. ఆసుపత్రి సమాచారంతో ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు.
  • ఏపీ ప్రజలకు శుభవార్త: తగ్గుముఖం పట్టనున్న కరోనా. ఇప్పటికే 15 శాతం పైగా హెర్డ్ ఇమ్యూనిటీ గుర్తింపు. ఈ నెల 21 నుంచి కర్నూలు తూర్పుగోదావరి జిల్లాలలో, వచ్చే నెల 4 నుంచి గుంటూరు కృష్ణ అనంతపురం చిత్తూరు నెల్లూరు జిల్లాలలో భారీగా తగ్గుముఖం పట్టనున్న కరోనా. మరణాల సంఖ్యలో కూడా భారీ తేడా కనిపించబోతుంది. శనివారం నుంచి భారీగా మొదలుకానున్న సిరోసర్విలేన్స్. Covid 19 ఏపీ కమాండ్ కంట్రోల్ రూమ్ స్పెషలాఫీసర్ డాక్టర్ సి ప్రభాకర్ రెడ్డి.

నాడు వంటలక్క.. నేడు కోటికి పడగెత్తింది

Cook Babita Becomes 2nd Person To Win Rs 1 Cr On Kaun Banega Crorepati 11, నాడు వంటలక్క.. నేడు కోటికి పడగెత్తింది

బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ ప్రోగ్రాంకు బుల్లితెరపై విశేష స్పందన లభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో సామాన్యులకు ఓ వరం అని చెప్పవచ్చు. సరస్వతి కటాక్షంతో లక్ష్మీదేవిని పొందడానికి ఈ షో వారికి చక్కని వేదిక అయింది. 2000లో మొదలైన ఈ షో ఇప్పటికే 10 సీజన్స్ పూర్తి చేసుకుని.. 11వ సీజన్‌ను ప్రారంభించింది. ఎప్పటిలానే ఈ షో మరో నిరుపేదను కోటీశ్వరురాలిని చేసింది. బబితా థాడే.. ఎక్కడో మహారాష్ట్రలోని మారుమూల గ్రామంలో నివసించే ఈమె.. ఇప్పుడు భారతదేశంలో ఓ సంచలనం. ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ సీజన్ 11 ఆమెను కోటీశ్వరురాలిని చేసింది. యువతకు స్ఫూర్తినిచ్చే ఆమె జీవిత జర్నీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మహారాష్ట్రలోని గవర్నమెంట్ పాఠశాలలో బబితా వంటమనిషిగా పనిచేసేవారు. నెలకు రూ.1500 జీతంతో బ్రతుకు జట్కా బండిని నడిపిస్తూ పోరాటం సాగించేవారు. ఉన్నదానితో కడుపు నింపుకుని.. లేకపోతే పస్తులు ఉంటూ జీవనాన్ని గడిపే నిరుపేద. తన పేదరికాన్ని పట్టించుకుని బాధపడకుండా ప్రతిరోజూ పాఠశాలలో తన కర్తవ్యాన్ని నిర్వర్తించేవారు. 450 పిల్లలకు రోజూ చక్కని భోజనం వండి పెడుతూ.. వారి సంతోషంలోనే తన ఆనందాన్ని వెతుక్కునేవారు. బబితా అసలే చెయ్యి తిరిగిన వంటమనిషి.. ఆమె ‘కిచిడీ’ చేయడంలో స్పెషలిస్ట్. ఎప్పుడు ‘కిచిడీ’ చేసినా.. పిల్లలు ఇష్టంగా తినేవారు. ఇలా సాధారణంగా సాగుతున్న జీవితంతో అక్కడే ఉండిపోకూడదని దృఢ నిశ్చయం తీసుకుంది. గొప్పగా ఏదో ఒకటి సాధించాలని కలలు కన్నారు. దానికోసం నిరంతరం కృషి చేశారు. అలా ఆమెను అదృష్టం తలుపు తట్టింది. ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’కి ఆమె ఎంపికయ్యారు. బిగ్ బీ ఎదురుగా హాట్ సీట్‌లో ఆమె ఆసీనులయ్యారు.

ఈ క్విజ్ షోలో ఆమె ఎన్నో కఠిన ప్రశ్నలను ఎదుర్కొన్నారు. ‘స్లమ్‌డాగ్ మిలినియర్’ సినిమాలో చూపించినట్లు.. బ్రతుకు సమరంలో నిత్యం గెలుస్తున్న సామాన్యులకు ఎంత కష్టమైన ప్రశ్నలైనా చిన్నవిగా ఉంటాయి. సరిగ్గా అలాగే బబితా థాడే కూడా ఆ ప్రశ్నలకు సులువుగా సమాధానాలు ఇచ్చారు. ఒక్కో రౌండ్ దాటుకుంటూ వచ్చారు. చివరికి కోటి రూపాయల ప్రశ్న ఎదురైంది. ఆ క్షణంలో ఆమెతో పాటు అక్కడ ఉన్న అందరికీ గుండె వేగం రెట్టింపు అయ్యింది. నరాలు తెగే ఉత్కంఠ.. అయినా ఆమె బెదరకుండా సమాధానం ఇచ్చారు. ఇక అందరూ కూడా బిగ్‌బి స్పందన కోసం ఎదురు చూశారు. ఇక బిగ్‌బి ఒక్కసారిగా ‘కరెక్ట్‌ ఆన్సర్‌. ఏక్‌ క్రోర్’ అనడంతో షోకి వచ్చిన వాళ్లకు ఆనందం. బబితా కళ్ళలో భావోద్వేగం కనిపించాయి. నెలకు రూ. 1500 జీతాన్ని అందుకునే ఓ సాధారణ మహిళ.. ఇప్పుడు కోటీశ్వరురాలుగా మారింది. కృషితో సుసాధ్యం కానీ పని ఉండదని మరోసారి బబితా థాడేతో నిరూపితమైంది. ఈమె ఎపిసోడ్ ఇంకా టీవీలో ప్రసారం కానప్పటికీ.. ప్రోమో టెలికాస్ట్ అయిన రోజు నుంచే బబితా థాడేకు ప్రశంసలు వెల్లువెత్తాయి.

Related Tags