ఉద్రిక్తంగా మారిన ఆలయ భూ వివాదం

పశ్చిమగోదావరి జిల్లా జగ్గారెడ్డి గూడెంలో ఉద్రిక్తత నెలకొంది. స్థానిక వేణుగోపాల స్వామి ఆలయ భూముల్లో ఆక్రమణల తొలగింపు ఉద్రికత్తకు దారితీసింది. జంగారెడ్డి గూడెం రెవెన్యూ పరిధిలో సర్వే నెంబ. 450/5లో 1.76 సెంట్ల దేవస్థానం భూమి కలదు. ఆ భూమిలో కొందరు ఆక్రమణదారులు భూమిని కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారంటూ కోర్టును ఆశ్రయించిన దేవాదాయ శాఖ అధికారులు పోలీసులు, రెవెన్యూ అధికారులు, పూర్తి బందోబస్తుతో ఆక్రమణల తొలిగింపుకు చర్యలు చేప్టటారు. జేసీబీలతో అధికారులు అక్కడకు చేరుకున్నారు. అధికారుల […]

ఉద్రిక్తంగా మారిన ఆలయ భూ వివాదం
Follow us

|

Updated on: Sep 26, 2019 | 6:07 PM

పశ్చిమగోదావరి జిల్లా జగ్గారెడ్డి గూడెంలో ఉద్రిక్తత నెలకొంది. స్థానిక వేణుగోపాల స్వామి ఆలయ భూముల్లో ఆక్రమణల తొలగింపు ఉద్రికత్తకు దారితీసింది. జంగారెడ్డి గూడెం రెవెన్యూ పరిధిలో సర్వే నెంబ. 450/5లో 1.76 సెంట్ల దేవస్థానం భూమి కలదు. ఆ భూమిలో కొందరు ఆక్రమణదారులు భూమిని కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారంటూ కోర్టును ఆశ్రయించిన దేవాదాయ శాఖ అధికారులు పోలీసులు, రెవెన్యూ అధికారులు, పూర్తి బందోబస్తుతో ఆక్రమణల తొలిగింపుకు చర్యలు చేప్టటారు. జేసీబీలతో అధికారులు అక్కడకు చేరుకున్నారు. అధికారుల జేసీబీలను స్థానికులు అడ్డుకున్నారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పరిస్థితి కాసేపు అదుపుతప్పి తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. దేవాదాయ శాఖ అధికారులు, ఆక్రమణదారులకు మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఉన్న పళంగా తమను ఖాళీ చేయమంటే..ఎక్కడు పోతామంటూ వారు అధికారులను అడ్డుకున్నారు. తమకు ప్రత్యామ్నాయం చూపించకుండా నిర్మాణాలను తొలగించడానికి వీలేద్దంటూ స్థానికులు మండిపడ్డారు. అయితే, విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే సంఘటన స్థలానికి చేరుకుని ఇరు వర్గాలకు  నచ్చజెప్పారు. ఆక్రమణల తొలగింపు విషయంలో నెలరోజుల గడువు ఇప్పించారు. అధికారులతో చర్చించి బాధితులకు మరోచోట శాశ్వత గృహాలు నిర్మించి ఇస్తామని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.